Jagan : జగన్ సంచలన నిర్ణయం.. హిమాలయాలకు వెళ్లేందుకు ప్లాన్! AP: ఎన్నికల్లో ఓటమి తరువాత హిమాలయాలకు వెళ్లాలని అనుకున్నట్లు జగన్ నేతలకు చెప్పినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ 40 శాతం ఓట్లు చూసి ఆగిపోయానని.. ఓటమి నుంచి కోలుకోడానికి తనకు 2,3 రోజులు పట్టిందని అన్నారని చర్చ సాగుతోంది. By V.J Reddy 29 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Jagan Decided To Go Himalayas : అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఓటమి తర్వాత తీవ్ర ఆవేదనలో జగన్ (YS Jagan) ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలు చూసి జగన్ హిమాలయాలకు (Himalayas) వెళ్లాలనుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. పార్టీ నేతలతో తన మనసులో మాట జగన్ పంచుకున్నట్లు తెలుస్తోంది. జగన్ చేసిన వ్యాఖ్యలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు (Election Results) చూసి హిమాలయాలకు వెళ్లాలనిపించిందని నేతలతో చెప్పినట్లు వైసీపీలో చర్చ జరుగుతోంది. కానీ 40 శాతం ఓట్లు చూసి ఆగిపోయానని చెప్పినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఫలితాల షాక్ నుంచి బయటకు రావడానికి నాకు 2, 3 రోజులు పట్టిందని వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. 40 శాతం ఓట్లు అంటే పెద్ద సంఖ్యలో జనం మన వెంటే ఉన్నారని వారి కోసమైనా నిలబడాలి అనుకున్నానంటూ జగన్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలంగా మారాయి. Also Read : రోహిత్, కోహ్లీకి భజన.. టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు! #ex-cm-jagan #assembly-elections #himalayas #ap-election-results-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి