Smita Sabharwal : స్మితా సబర్వాల్ ట్వీట్‌ వివాదాస్పదం.. బాలలతా ఫైర్

ఐఏఎస్‌/ఐపీఎస్/ఐఎఫ్‌ఓఎస్ లాంటి ప్రీమియర్ సర్వీసుల్లో దివ్యాంగులకు కోటా అవసరమా అని ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ ఎక్స్‌లో ట్విట్‌ చేశారు. దీనిపై మాజీ బ్యూరోక్రాట్‌ బాలలతా స్పందించారు. స్మితా దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడరని ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

New Update
Smita Sabharwal : స్మితా సబర్వాల్ ట్వీట్‌ వివాదాస్పదం.. బాలలతా ఫైర్

Bala Latha Reacts To IAS Smita Sabharwal Tweet : ఇటీవల ఐఏఎస్‌ ట్రైనీ అధికారి పూజా ఖేద్కర్ (Pooja Khedkar) ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆమె తనకు వైకల్యం ఉన్నట్లు కూడా తప్పుడు సర్టిఫికేట్ సమర్పించారు. ఇప్పటికే యూపీఎస్సీ (UPSC).. పూజా అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతోపాటు భవిష్యత్తులో మళ్లీ ఆమె పరీక్షలకు హాజరు కాకుండా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై చర్చ జరుగుతున్న వేళ.. ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ (Smita Sabharwal) దీనిపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. ' ఒక ఎయిర్‌లైన్‌.. వైకల్యం ఉన్నవారని పైలట్‌గా తీసుకుంటందా ?, వైకల్యం ఉన్న ఒక సర్జియన్‌ను మీరు నమ్ముతారా ?. ఐఏఎస్‌/ఐపీఎస్/ఐఎఫ్‌ఓఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది. ప్రజల సమస్యలను వినాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫిజికల్ ఫిట్‌నెస్ అవసరమవుతుంది. ఇలాంటి ప్రీమియర్‌ సర్వీస్‌కి దివ్యాంగ కోటా ఎందుకు అవసరం' అంటూ రాసుకొచ్చారు.

Also Read:  జగన్‌కు ఏం చెప్పానంటే?.. RTVతో RRR ఎక్స్‌క్లూజీవ్!

దీంతో స్మిత సబర్వాల్‌ వ్యాఖ్యలను మాజీ బ్యూరోక్రాట్ బాలలత తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులను కించపరిచేలా మట్లాడారంటూ మండిపడ్డారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన స్మీతా సబర్వాల్ ఇలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. 'ఆమె ట్వీట్ దివ్యంగుల పట్ల వివక్షతను చూపుతోంది. ఐటీ యాక్ట్ కింద స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి. స్మితపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి. లేదంటే ట్యాంక్ బండ్‌పై ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. స్మిత చేసిన వ్యాఖ్యలపై సాటి ఐఏఎస్‌లు స్పందించాలి. ఆమెకు ఏదైనా జరగరానిది జరిగి దివ్యంగురాలు అయితే ఐఏఎస్ కి రాజీనామా చేస్తారా ?. ఆమె రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది' అంటూ బాలలతా అన్నారు. మరోవైపు స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చాలామంది ఆమెకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. స్మితా సబర్వాల్ మానసిక స్థితి బాగాలేదని అంటున్నారు.

Also Read: పార్లమెంటు సమావేశాల్లో నీట్ అంశం.. కౌంటర్‌ ఇచ్చిన ధర్మేంద్ర ప్రధన్



Advertisment
తాజా కథనాలు