బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు రహీల్‌ను పోలీసులు అరెస్టు చేశాడు. విదేశాల నుంచి సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన రహీల్‌ను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత రహీల్ స్థానంలో మరో డ్రైవర్‌ను చేర్చారు. అనతంరం రహీల్ దుబాయ్‌కి పారిపోయాడు.
Also Read: యూట్యూబ్ ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన టీచర్
రహీల్‌పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు దుబాయ్ పారిపోవడంతో.. అతడిపై లుక్‌ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఎట్టకేలకు రహీల్ హైదరాబాద్‌కు రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే అయిన షకీల్‌ను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు రావడంతో ఆయనపై కూడా కేసు నమోదైంది.