Green Climate Team : ఓటర్లు(Voters) అందరూ ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజాస్వామ్యాన్ని బతికించాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో(NGO) వ్యవస్థాపక కార్యదర్శి జె.వి రత్నం(JV Ratnam) పిలుపునిచ్చారు. గురువారం జివిఎంసి ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వద్ద భారత ఎన్నికల సంఘం(Election Commission of India) తరఫున స్వీప్ కార్యక్రమాన్ని ప్యీపుల్స్ పవర్, ఎఎస్ కె ఫౌండేషన్, సీఫా ట్రస్ట్, గ్రీన్ క్లైమేట్ టీం తదితర ఎన్జీవలోలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే అంశం మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
18 సంవత్సరాలు దాటిన వారంతా ఓటు హక్కును పొంది ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరారు. మన ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఐదేళ్లపాటు మనల్ని సజావుగా పాలించే నాయకులను ఎన్నుకునే బాధ్యత మనపై ఉందన్నారు. అందుకే మనమంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పీపుల్స్ పవర్ వ్యవస్థాపకులు నిమ్మకాయల భాస్కర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పేద, ధనిక, కులం, మతం, వర్ణం అనే బేధం లేకుండా భారతీయులందరికీ ఓటు హక్కుని కల్పించిందన్నారు. ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. మేధావులు విద్యార్థులు కర్షకులు కార్మికులు ఉద్యోగులు నిరుద్యోగులు అమ్మలు అక్కలు అన్నలు వృద్ధులు యువకులు అనే తారతమ్యం లేకుండా 18 ఏళ్ల పైబడిన వారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
సిఫా ట్రస్ట్ ప్రతినిధి నర్సింగ్ మాట్లాడుతూ ఆశించే మార్పు రావాలంటే శాసించే మీ ఓటు వేయాలని కోరారు. మనకు ఇష్టమైన నాయకులు పోటీలో లేకుంటే "నోటా" బటన్ నొక్కి పైన ఉన్న వారెవరూ కాదు అని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి, సిఫా సంస్థ ప్రతినిధులు ఆస్క్ ఫౌండేషన్ ప్రతినిధి మునీర్, తదితరులు పాల్గొని మాట్లాడారు.
Also Read : వైసీపీకి బిగ్ షాక్.. సజ్జల భార్గవ్ పై కేసు నమోదు