/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/jagan-1.jpg)
Ap Politics: మరి కొన్ని గంటల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ నాయకులతో పాటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేతలంతా కూడా తమ పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నేతలకు సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా '' ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను'' అంటూ రాసుకొచ్చారు.
ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024
Also read: లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్.. RTV సంచలన పోస్ట్ పోల్ స్డడీ