నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు సేవలందిస్తుంది ఈ సంస్థ. ఈ సంస్థలో సుమారు 18వేలకు పైగా ఉద్యోగాలను రిక్రూట్ చేస్తోంది. దీనికి సంబంధించిన దరఖాస్తు గడువు మరో 10 రోజుల్లో ముగియనుంది.
ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఇటీవల అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ESIC రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ ద్వారా మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్/అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్, హెడ్ క్లర్క్/అసిస్టెంట్ సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/మేనేజర్ గ్రేడ్ 17710 వంటి పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ రిక్రూట్ మెంట్ కు దరఖాస్తు గడువు నవంబర్ 28తో ముగుస్తుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే అధికారిక పోర్టల్ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే సంస్థ అప్లికేషన్ గడువును పెంచే ఛాన్స్ లేనట్లు సమాచారం.
పోస్టుల వివరాలు :
ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 17,710 ఖాళీలను భర్తీచేస్తుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, హెడ్ క్లర్క్ అసిస్టెంట్ సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, మేనేజర్ గ్రేట్ 2 సూపర్ ఇన్ టెండెంట్ వంటి పోస్టులకు నియామక ప్రక్రియ జరగనుంది.
అర్హత:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 తరగతి లేదా అందుకు సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అప్పర్ లోయర్, హెడ్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయస్సు 30ఏళ్లలోపు ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ:
-ఈఎస్‌ఐసీ అధికారిక పోర్టల్ esic.nic.in ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలోకి వెళ్లండి, ‘రిక్రూట్‌మెంట్’ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- ESIC రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను గమనించండి.
- అర్హత ఉన్న పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు పోస్టు దగ్గర ‘అప్లై నౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
- పేరు, ఫోన్ నంబర్ తదితర పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
జీతం:
-లోయర్ డివిజన్ క్లర్క్‌కు జీతం నెలకు రూ.25,500 నుంచి రూ.81,100
- అప్పర్ డివిజన్ క్లర్క్‌కు రూ.19,900 నుంచి రూ.63,200
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు రూ.18,000 - రూ.56,900,
-హెడ్ క్లర్క్ రూ.35,400- రూ.1,12,400,
సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ కు రూ.44,900-రూ.1,42,400
ఇది కూడా చదవండి: కేసీఆర్ ఓవైసీ బెదిరింపులకు లొంగిపోయాడు.. అమిత్ షా సంచలన ఆరోపణలు