/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-21T135343.818.jpg)
Mechanic Rocky: మాస్ కా దాస్ విశ్వక్ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్యాక్ బ్యాక్ హిట్స్ తర్వాత ‘మెకానిక్ రాకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన విశ్వక్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
శ్రద్ధ శ్రీనాథ్ ఆన్ బోర్డు
అయితే తాజాగా మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఫిమేల్ లీడ్ గా మరో కీలక పాత్రలో నటించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వక్ మాస్ యాక్షన్ ‘మెకానిక్ రాకీ’ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానున్నట్లు ప్రకటించారు.
Welcoming @ShraddhaSrinath to the exciting ride of #MechanicRocky 🤩
The world is ready to witness her charm yet again! ✨#MechanicRockyOnOCT31 🛠️
'Mass ka Das' @VishwakSenActor @itsRamTalluri @Meenakshiioffl @RaviTejaDirects @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit… pic.twitter.com/1OSnY0FyOC
— Ram Talluri (@itsRamTalluri) July 21, 2024
Also Read: Viral Video: అనిరుధ్ కన్నా నువ్వే తోపు.. గల్లీ కుర్రోడి మ్యూజిక్ కు నెటిజన్లు ఫిదా! - Rtvlive.com