Gulledu Gulledu Lyrical: టాలీవుడ్ మాస్ కా దాస్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), మీనాక్షి చౌదరీ (Meenakshi), శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెకానిక్ రాఖీ (Mechanic Rocky). ముళ్లపూడి రవితేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న దీపావళి కానుకగా సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే మూవీ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
‘గుల్లెడు గుల్లెడు' సాంగ్
తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే'.. అంటూ సాగే ఈ మెలడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు జేక్స్ బెజోయ్ అందించగా.. సుద్ధాల అశోక్‌తేజ లిరిక్స్ రాశారు. సింగర్ మంగ్లీ ఆలపించారు. యష్ కొరియోగ్రఫీ చేశారు. పాటలోని డాన్స్ మూమెంట్స్, విజువల్స్ ఆకర్షణీయంగా కనిపించాయి. మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో విశ్వక్ టైటిల్ రోల్ లో కనిపించబోతున్నారు.
When wedding shenanigans meets folk energy! 💃
Here's #GulleduGulledu from #MechanicRocky 💥https://t.co/XMwO38Vd0b
🎵 @JxBe
🎤 @iamMangli
✍️ #SuddalaAshokTeja#MechanicRockyOnOCT31 🛠️@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @ShraddhaSrinath @SRTmovies… pic.twitter.com/OFMonFKz1G
— VishwakSen (@VishwakSenActor) August 7, 2024
Also Read: Naga Chaitanya: నేడు నాగచైతన్య నిశ్చితార్థం..అమ్మాయి ఎవరో తెలుసా..! - Rtvlive.com