Devi Sri Prasad: హైదరాబాద్లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్.. టికెట్స్ ఇక్కడ బుక్ చేసుకోండి..? టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లైవ్ ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్ లో మ్యూజికల్ కాన్సెర్ట్ చేయబోతున్నారు. ఈ లైవ్ కాన్సెర్ట్ అక్టోబరు 19న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించిన టికెట్స్ www.actcevents.com వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. By Archana 15 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Devi Sri Prasad: టాలీవుడ్ రాక్ స్టార్, నేషనల్ అవార్డు విజేత ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హైదరాబాద్ లో మ్యూజికల్ కాన్సెర్ట్ చేయబోతున్నారు. లైవ్ ఇండియా టూర్ లో (DSPLiveIndiaTour) భాగంగా డీఎస్పీ లైవ్ షో పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ ను ACTC అనే ఈవెంట్ సంస్థ నిర్వహిస్తోంది. డీఎస్పీ సూపర్ హిట్ చార్ట్ బస్టర్స్ తో మారుమోగిపోయేలా ఈ హై ఓల్టేజ్ కాన్సెర్ట్ ఉండబోతున్నట్లు చెబుతున్నారు. లైవ్ కాన్సెర్ట్ బుకింగ్స్ ఈ లైవ్ కాన్సర్ట్ అక్టోబరు 19న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో (Gachibowli Stadium) జరగనుంది. ఈ ఈవెంట్ కు సంబంధించిన టికెట్స్ కోసం www.actcevents.com వెబ్ సైట్, Paytm ఇన్‌సైడర్ ద్వారా టికెట్స్ కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే యూరప్, ఆస్ట్రేలియా, US, UK వంటి దేశాల్లో తన మ్యూజికల్ కాన్సెర్ట్స్ తో జనాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు డీఎస్పీ. ఇప్పుడు తన స్వదేశం ఇండియాలో కూడా ప్రదర్శనలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు డీఎస్పీ. ఇందులో భాగంగా హైదరాబాద్ లో తన ఫస్ట్ లైవ్ కాన్సెర్ట్ చేయబోతున్నట్లు తెలిపారు. సాధారణంగా సినిమాల్లోనే దేవి పాటలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన లైవ్ కాన్సెర్ట్ అంటే ఫ్యాన్స్ లో సంతోషం మామూలుగా ఉండదు. Also Read: Ambani Wedding: అంబానీ పెళ్లిలో బాంబు కలకలం.. రంగంలోకి పోలీసులు! - Rtvlive.com #hyderabad #devi-sri-prasad #dsp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి