Kalki 2898 AD: 'కల్కి'కి జాక్ పాట్.. ఓటీటీ రైట్స్ కోసం రెండు దిగ్గజ ప్లాట్ ఫార్మ్స్ బరిలో ...!

ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ 'కల్కి' విడుదలైన తొలిరోజు నుంచే రికార్డు వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్‌కు సంబంధించి ఓ న్యూస్ వైరలవుతోంది. హిందీలో నెట్‌ఫ్లిక్స్ 175 కోట్లకు, సౌత్ భాషల్లో అమెజాన్‌ప్రైమ్ 200 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Kalki 2898 AD: 'కల్కి'కి జాక్ పాట్.. ఓటీటీ రైట్స్ కోసం రెండు దిగ్గజ ప్లాట్ ఫార్మ్స్ బరిలో ...!

Kalki 2898 AD OTT: 2024 సంవత్సరంలో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రేక్షకుల నిరీక్షణ జూన్ 27తో ముగిసింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం జూన్ 27 న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తొలిరోజు నుంచే రికార్డు వసూళ్లను రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తొలి రోజు ఇండియాలో 95 కోట్ల వసూళ్లు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఓటీటీ విడుదల

ఇక కల్కి థియేటర్స్ లో సందడి చేస్తుండగానే.. ఓటీటీ విడుదలకు సంబంధించిన అప్డేట్ వైరలవుతోంది. కల్కి 2898 AD రెండు OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కల్కి 2898 AD నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime) రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్

హిందీలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఈ సినిమా హక్కులను 175 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా.. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో 200 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే థియేటర్లలో విడుదలైన రెండు నెలల వరకు సినిమా ఏ OTT ప్లాట్‌ఫారమ్‌లోనూ విడుదల చేయబడదని సమచారం. ఈ సినిమాలో భైరవుడి పాత్రలో ప్రభాస్ నటించాడు. స్టార్ కాస్ట్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: IMDB Rating: టాప్ రేటింగ్ ఇండియన్ రియాలిటీ షోస్.. బిగ్‌బాస్‌ షో IMDB రేటింగ్‌ ఎంతో తెలుసా? - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు