Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ 8లో శివాజీ ఎంట్రీ ! కానీ కంటెస్టెంట్ కాదు.. ?

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇటీవలే విడుదలైన సీజన్ 8 ప్రోమో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా సీజన్ 8కు సంబంధించిన మరో అప్డేట్ వైరలవుతోంది. సీజన్ 8 బిగ్ బాస్ బజ్ షో హోస్టుగా ఎక్స్ కంటెస్టెంట్ శివాజీ వ్యవహరించబోతున్నట్లు టాక్.

New Update
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ 8లో  శివాజీ ఎంట్రీ ! కానీ కంటెస్టెంట్ కాదు.. ?

Bigg Boss 8 Telugu: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే విడుదలైన సీజన్ 8 ప్రోమో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేస్తోంది. ప్రోమోలో 'ఒక్కసారి కమిట్‌ అయితే లిమిటే లేదు’ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సారి లిమిట్ లెస్ ఎంటర్ టైనమెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ సీజ‌న్ 7 అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకొని పెద్ద స‌క్సెస్‌ కావడంతో.. సీజన్ 8 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. దీంతో సీజన్ 8 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరు, ఈ సారి బజ్ హోస్ట్ గా ఎవరు ఉండబోతున్నారు అంటూ  నెట్టింట చర్చ మొదలైంది.

publive-image

బిగ్ బాస్ బజ్ హోస్టుగా శివాజీ

ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. సీజన్ 8... 'బిగ్ బాస్ బజ్' టాక్ షోకు హోస్ట్ గా ఎక్స్ కంటెస్టెంట్ శివాజీ (Shivaji) వ్యవహరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని కోసం శివాజితో బిగ్ బాస్ మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సీజన్ 7 లో గీతూ రాయ‌ల్ బిగ్‌బాస్ బ‌జ్ షోకు హోస్ట్‌గా క‌నిపించింది.

బిగ్ బాస్ బజ్

బిగ్ బాస్ బజ్ అనేది ఒక టాక్ షో. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొంటారు. ఇందులో హోస్టులు కంటెస్టెంట్స్‌ ఆట‌తీరుతో పాటు వారు బయటకు రావడానికి గల కారణాలను విశ్లేషిస్తారు. అలాగే హౌస్ లోపల కంటెస్టెంట్స్ మధ్య జరిగే విషయాలను వారి నుంచి రాబడతారు. ఇక సీజన్ 7 లో శివాజీ ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజయంలో కీలకంగా మారారు. షో మొదటి నుంచి ప్రశాంత్ ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. టైటిల్ గెలవకపోయిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ హృదయాలను గెలిచారు.

Also Read: CM Revanth Reddy: 'బలగం' చిత్రబృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు