/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-21T133718.084.jpg)
Allu Arjun - Sukumar As A Chief Guests : రావు రమేష్ (Rao Ramesh) లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ (Maruthi Nagar Subramanyam). ఈ చిత్రాన్ని పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పణలో రూపొందింది. ఆమెకు సినిమా కథ నచ్చి మరీ మూవీ టీమ్ లో జాయిన్ అయ్యారట. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని శ్రద్దగా పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 23న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇక ఈ సినిమాను సుకుమార్ భార్య తబిత ప్రజెంట్ చేస్తుండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా ప్లాన్ చేశారు. ఈ రోజు జరగబోయే ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీరిలీజ్ వేడుకకు అల్లు అర్జున్, సుకుమార్ ముఖ్య అతిథులుగా రావడం సెన్సెషన్ గా మారింది.
అల్లు అర్జున్- సుకుమార్
గత కొద్దిరోజులుగా 'పుష్ప2' విషయంలో అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విబేధాలు వచ్చాయని, దాంతో అల్లు అర్జున్ (Allu Arjun) షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడని పలు వార్తలు వచ్చాయి. దానికి తోడు ఏపీ ఎన్నికల (AP Elections) తర్వాత మెగా ఫ్యామిలీకి ...అల్లుఅర్జున్ దూరం అయ్యాడు అంటూ కూడా ప్రచారం జరిగింది. ఇక ఈ వివాదాల తర్వాత అల్లుఅర్జున్ ఎటువంటి ఫంక్షన్స్ లో కనిపించలేదు. చాలా రోజుల తర్వాత ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ఈవెంట్ కు అటెండ్ కాబోతున్నారు. అది కూడా సుకుమార్, బన్ని కలిసి ఒకే స్టేజ్ సందడి చేయడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని ఇస్తుంది.
ఇక రోజు స్టేజ్ పై బన్నీ ఏం మాట్లాడతాడా అని ఆసక్తిగా ఉన్నారు ఫ్యాన్స్. పుష్ప 2 గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా..? లేదా తన వస్తున్న రూమర్స్ కు సమాధానం చెబుతాడు..? ఇలా అనేక విషయాలు అభిమానుల మనసులో మెదులుతున్నాయి. ఈ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6గంటల నుంచి హోటల్ పార్క్ హయత్ లో జరగనుంది.
View this post on Instagram
Also Read: Kiran Abbavaram Marriage: రేపు ఘనంగా కిరణ్ అబ్బవరం పెళ్లి.. వివాహ వేడుకలు అక్కడే - Rtvlive.com