Jammu-kashmir: కుప్వారాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

ఉత్తర కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని కెరాన్‌ సెక్టార్‌లో కెరాన్‌ సరిహద్దు ప్రాంతంలోని భారత్‌-పాకిస్థాన్‌ నియంత్రణ రేఖ సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీకి చెందిన 6 ఆర్‌ఆర్‌, ఎస్‌ఓజీ సైనికులు, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.

Jammu-kashmir: కుప్వారాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
New Update

Encounter: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు, భారత ఆర్మీ మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు జవాన్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈరోజు ఉత్తర కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని కెరాన్‌ సెక్టార్‌లో కెరాన్‌ సరిహద్దు ప్రాంతంలోని భారత్‌-పాకిస్థాన్‌ నియంత్రణ రేఖ సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీకి చెందిన 6 ఆర్‌ఆర్‌, ఎస్‌ఓజీ సైనికులు, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.

ఈ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని రాంబన్‌-దోడా రేంజ్‌ డీఐజీ శ్రీధర్‌ పాటిల్‌ పేర్కొన్నారు. దోడాలోని కస్తిగర్ ప్రాంతంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని కమాండ్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి అనుమానాస్పద కార్యకలాపాలను సైన్యం గుర్తించింది. ఆ తర్వాత వెంటనే భద్రతా బలగాలను రంగంలోకి దించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.

Also Read:Supreme court: సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

#jammu-kashmir #terrorists #encounter #indian-army
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి