Encounter: ఢిల్లీలో ఎన్ కౌంటర్ కలకలం.. పోలీసులపై కాల్పులు!

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌ ఇష్యూ కలకలం రేపింది. అర్ధరాత్రి పూట గ్యాంగ్ స్టర్లు రెచ్చిపోయారు. లొంగిపోమని చెప్పిన వినకుండా పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఒక దుండగుడు చనిపోగా.. ఇద్దరు పోలీసులు గాయపడ్డట్లు డీజీపీ జాయ్‌ టిర్కీ తెలిపారు.

Encounter: ఢిల్లీలో ఎన్ కౌంటర్ కలకలం.. పోలీసులపై కాల్పులు!
New Update

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌ ఇష్యూ కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి పూట గ్యాంగ్ స్టర్లు రెచ్చిపోయారు. ఈశాన్య ఢీల్లీలోని అంబేడ్కర్‌ కాలేజీ దగ్గర రాత్రి 1.30 గంటలకు పోలీసులపై కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులపై కాల్పులు..
ఈ మేరకు ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాశిమ్‌ ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మార్చి 9న అర్బాజ్‌ అనే వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో గ్యాంస్టర్ల కదలికలపై పోలీసులు నిగాపెట్టి గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం గ్యాంగ్ స్టర్ల గురించి సమాచారం అందగానే పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. దుండగుల కాళ్లకు తీవ్ర గాయలవడంతో పరిగెత్తలేక పడిపోయారు.

ఇది కూడా చదవండి: BREAKING: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్

డీసీపీ జాయ్‌ టిర్కీ ..
ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. గ్యాంగ్ స్టర్లతోపాటు గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు డీసీపీ జాయ్‌ టిర్కీ తెలిపారు. ఇక దీనిపై హత్య, హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

#police #delhi #encounter #gangster
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe