Starlink: ఎలాన్ మస్క్ స్టార్ లింక్‌తో ఓజోన్ పొరకు ప్రమాదం

అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం ఎలాన్ మస్క్ సంస్థలు ఏర్పాటు చేసిన స్టార్ లింక్ శాటిలైట్ ఇప్పుడు మొత్తం మానవాళికే ప్రమాదం తెచ్చేలా ఉంది. ఇంటర్నెట్ మాటేమో కానీ దాని వలన ఓజోన్ పొరను దెబ్బతీస్తోందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

New Update
Starlink: ఎలాన్ మస్క్ స్టార్ లింక్‌తో ఓజోన్ పొరకు ప్రమాదం

starlink satellite : చిన్న యాంటెన్నా సాయంతో ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా సులభంగా ఇంటర్నెట్ సేవలు అందించే ఉద్దేశంతో అంతరిక్షంలోని స్టార్‌లింక్ శాటిలైట్లను పంపారు. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ దీనిని ఉర్పాటు చేసింది. దీని వలన అత్యంత వేగంగా ఇంటర్నెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అది ఓజోన్ పొరకే ప్రమాదంగా మారింది. ఈ స్టార్ లింక్‌ వల్ల అధిక మొత్తంలో అల్యూమినియం ఆక్సైడ్ వాయువు వెలువడుతోంది. అది ఓజోన్ లేయర్‌ను క్షీణింపజేస్తోంది. స్టార్‌లింక్ శాటిలైట్లు దిగువ భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయి. ఈ ఇంటర్నెట్ శాటిలైట్ల జీవితకాలం దాదాపు 5 ఏళ్లు.

ప్రస్తుతం లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో 8000 కంటే ఎక్కువ ఇంటర్నెట్ ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 6000 స్టార్‌లింక్ శాటిలైట్లే. వీటి జీవితకాలం ముగిసిన సందర్భంలో ఇవి భూమిపై కూలిపోతాయి. అయితే, భూ వాతావరణ ఘర్షణ కారణంగా ఇవి భూమి పైకి చేరేలోపే కాలిపోతాయి. దీని ఫలితంగా ఏటా 1000 టన్నుల అల్యూమినియం ఆక్సైడ్స్ వెలువడుతోంది. అంటే 646 శాతం ఈ వాయువుల పెరుగుదల ఉంటుంది. అల్యూమినియం ఆక్సైడ్‌లు ఓజోన్‌ను క్లోరిన్‌తో విధ్వంసకర చర్యకు కారణమవుతాయి.ఇది స్ట్రాటో ఆవరణలోని ఓజోన్ పొరను క్షీణింపచేసి క్లోరిన్ యాక్టివేషన్ క్రిష్టల్స్ విడుదలవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు.

సూర్యుడి నుంచి వచ్చే అతినీలతోహిత కాంతిని ఓజోన్ పొర అడ్డగిస్తుంది. దీని వలనే భూమి మీ ఉన్న జీవజాలం బతకగలుగుతోంది. ఈ పొరే కనుక లేకపోతే భూమిపై ఉన్న జంతువులు, వృక్షజాలం మాడి మసి అయిపోతాయి. మనుషులు, జంతువులకు చర్మ క్యాన్సర్లు వచ్చి చచ్చిపోతారు. పంటల దిగుబడి, ఆహార ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది.

Also Read:T20 World Cup: సూపర్ 8లో మొదటి విజయం..అమెరికా మీద గెలిచిన సౌత్ ఆఫ్రికా

Advertisment