Trump : ట్రంప్‌పై కాల్పులు.. వివేక్ రామస్వామి ఏమన్నారంటే

ట్రంప్‌పై జరిగిన ఈ దాడి తనను షాక్‌కు గురి చేసిందని భారత సంతతికి చెందిన బిలియనీర్‌, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడ్డ నేత వివేక్‌ రామస్వామి అన్నారు. అధ్యక్ష ఎన్నికల పోటీలో లేకుండా చేసేందుకు ట్రంప్‌ను హత్య చేయాలని చూశారంటూ ఆరోపణలు చేశారు.

New Update
Trump : ట్రంప్‌పై కాల్పులు.. వివేక్ రామస్వామి ఏమన్నారంటే

Vivek Ramaswamy : అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పై జరిగిన హత్యాయత్నం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై భారత సంతతికి చెందిన బిలియనీర్‌, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడ్డ నేత వివేక్‌ రామస్వామి స్పందించారు. ట్రంప్‌పై జరిగిన ఈ దాడి తనను షాక్‌కు గురి చేసినట్లు పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల పోటీలో లేకుండా చేసేందుకు ట్రంప్‌ హత్య చేయాలని చూశారని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందన కూడా సరిగా లేదని విమర్శలు చేశారు.

Also Read: నా పైన రెండు సార్లు హత్యాయత్నం జరిగింది..మస్క్!

' అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎలాంటివాడనేది ఈ ఘటనతో బయటపడింది. ఆ దాడిలో జరిగిన మంచి ఇదొక్కటే. బుల్లెట్ తాకి, రక్తం కారుతున్నా కూడా ట్రంప్ ప్రజల కోసమే నిలబడ్డాడు. నాయకత్వం వహించడానికి సిద్ధమని సంకేతం ఇచ్చారంటూ' రామస్వామి ట్రంప్‌ను ప్రశంసించారు. ఓటర్లు (Voters) ఎవరికి ఓటు వేద్దామనుకున్నా కూడా ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించాల్సిందేనని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. జులై 13న శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ట్రంప్ ఎడమ చెవికి బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. అలాగే ర్యాలీకి వచ్చిన ట్రంప్ మద్ధతుదారుడు ఒకరు మృతి చెందారు.

Also Read: చనిపోయిన వారిని బతికించవచ్చా? ఆ కంపెనీ వందలాది శవాలను ఎందుకు భద్రపరుస్తుంది?

Advertisment
తాజా కథనాలు