Elon Musk: టెస్లా ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తున్నా.. ఎలాన్ మస్క్‌ కీలక నిర్ణయం

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌.. టెస్లా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని డెలావర్ నుంచి టెక్సాస్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. మస్క్‌ 55 బిలియన్ డాలర్ల ( రూ.4.5 లక్షల కోట్లు) భారీ ప్యాకేజ్ తీసుకునేందుకు అనర్హుడంటూ తాజాగా కోర్టు తీర్పునిచ్చిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

Elon Musk: టెస్లా ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తున్నా.. ఎలాన్ మస్క్‌ కీలక నిర్ణయం
New Update

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెస్లా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని డెలావర్ నుంచి టెక్సాస్‌కు తరలిస్తున్నట్లు ప్రకటన చేశారు. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల ( రూ.4.5 లక్షల కోట్లు) భారీ ప్యాకేజ్ తీసుకునేందుకు ఎలాన్ మస్క్ అనర్హుడంటూ తాజాగా డెలావర్ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన రోజులోనే మస్క్‌ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

Also Read: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాక్.. హెచ్‌-1బీ సహా పలు కేటగిరీలకు ఫీజులు పెంపు

టెక్సాస్‌కు తరలింపు

బుధవారం కోర్టు తీర్పు వచ్చిన వెంటనే.. ఎలాన్ మస్క్ ఎక్స్‌లో స్పందించారు. ఈ రాష్ట్రంలో ఎవరూ తమ సంస్థలను రిజిస్టర్‌ చేసుకోవద్దని పిలుపునిచ్చారు. అలాగే టెస్లా ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు మార్చాలా అనే పోల్‌ కూడా పెట్టారు. చాలామంది నెటీజన్లు టెక్సాస్‌కు అనుకూలంగా ఓటువేశారు. దీంతో సంస్థను టెక్సాస్‌కు తరలించనున్నట్లు మస్క్‌ ప్రకటించారు. అయితే టాక్స్ తక్కువగా ఉంటుందనే కారణంతో అమెజాన్ లాంటి పెద్ద సంస్థలు సైతం ఇక్కడే తమ సంస్థలను రిజిస్టర్ చేసుకుంటున్నాయి.

మస్క్‌కు ఎక్కువగా ఇచ్చారు

ఇదిలాఉండగా.. 2018లో ఎలాన్ మస్క్‌ అన్ని ప్రయోజనాలు కలిపి 55 బిలియన్ డాలర్ల వార్షిక వేతనం అందుకున్నారు. మస్క్‌కు ఎక్కువగా వేతనం ఇచ్చారంటూ.. టెస్లా వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్‌ టోర్నెట్టా అప్పట్లోనే డెలావర్‌ కోర్టును ఆశ్రయించారు. ఇంత ఎక్కువగా వేతనం చెల్లించడం అనేది కార్పొరేట్ ఆస్తులను వృథా చేయడమే అవుతుందంటూ ఆయన పిటిషన్‌లో తెలిపాడు. అయితే దీనిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు తీర్పును వెలువరించింది.

Also Read: అమెరికా నౌకపై దాడి చేశాం.. హౌతీ తిరుగుబాటుదారుల సంచలన ప్రకటన

#telugu-news #elon-musk #tesla
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe