Elon Musk: ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు (US Presidential Election)జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు, డెమొక్రాటిక్ నేత జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎన్నికల ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్రంప్ ప్రచారానికి పెద్ద మొత్తంలో విరాళం అందించినట్లు తెలుస్తోంది. ఎంత ఇచ్చారు అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. గతంలో ఎలాన్ మస్క్.. బైడెన్‌కి గానీ ట్రంప్‌నకు గానీ తన నుంచి ఎలాంటి ఆర్థిక సహాకారం ఉండదని చెప్పారు. కానీ ఇప్పుడు ట్రంప్ తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పొలిటికల్ యాక్షన్ కమిటీకి విరాళాలు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు
ఇదిలాఉండగా.. ఇటీవల బైడెన్, ట్రంప్ మధ్య డిబేట్ జరిగింది. ఇందులో బైడెన్‌పై ట్రంప్ విజయం సాధించినట్లు ప్రచారాలు జరుగుతున్నాయి. అంతేకాదు ట్రంప్ ప్రచారం కోసం ఇప్పటికే చాలావరకు కార్పొరేట్ కంపెనీలు విరాళాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా విరాళం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే జులై 15న పొలిటికల్ యాక్షన్ కమిటీ విరాళాలకు సంబంధించిన విషయాలు వెల్లడించనుంది. అప్పుడే ఎలాన్ మస్క్ నుంచి ట్రంప్ ప్రచారం కోసం ఎంత ముట్టిందనే విషయం తెలియనుంది.
మరో విషయం ఏంటంటే ఎలాన్ మస్క్ విరాళం ఇచ్చినప్పటికీ.. ఇప్పటిదాకా ఎవరి అభ్యర్థిత్వానికి కూడా మద్దతు ఇవ్వలేదు. కానీ చాలాకాలం నుంచి డెమోక్రాట్లపై మాత్రం మస్క్.. ఎక్స్ వేదికలో తన స్టైల్‌లో విమర్శలు చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా ట్రంప్ ట్విట్టర్ ఖాతాను బ్యాన్ చేయగా ట్విట్టర్‌ను చేజిక్కుంచున్నాకా ఎలాన్ మస్క్.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.
Also Read: ప్రపంచం అంతానికి పునాది పడుతోందా.. బాబా వంగా చెప్పినట్టే జరుగుతోందట..