Elon Musk: ఈవీఎంలు వాడొద్దు.. ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు..

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. ఈవీఎంల పనితీరుపై 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని సూచించారు. వీటిని తొలగించడం ద్వారా హ్యాకింగ్‌ను నివారించవచ్చని పేర్కొన్నారు.

New Update
Elon Musk: ఈవీఎంలు వాడొద్దు.. ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు..

దేశంలో లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన అనంతరం పలుచోట్ల ఈవీఎం హ్యాకింగ్‌లు జరిగాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. ఈవీఎంలపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని సూచించారు. వీటిని తొలగించడం ద్వారా హ్యాకింగ్‌ను నివారించవచ్చని పేర్కొన్నారు. అయితే ఇటీవల అమెరికాలోని ఫ్యూర్టోరికోలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎలాన్‌ మస్క్ ఇలా రాసుకొచ్చారు.

Also read: ఉక్రెయిన్ శాంతి శిఖరాగ్ర సదస్సులో భారత్.. రష్యాకు ఆహ్వానం లేదు

' మనం ఈవీఎంలను తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సాయంతో హ్యాక్ చేసే ప్రమాదముంది. ఇది దేశానికి నష్టం కలిగిస్తుందని' మస్క్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఫ్యూర్టోరికోలో జరిగిన ఎన్నికల్లో వివాదం తలెత్తడంతో ఈవీఎంల భద్రతపై అధికారులు ఫోకస్ పెట్టారు. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్ కెన్నెడీ సమీప బంధువైన రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ కూడా ఈవీఎంల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూర్టోరికోలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని అన్నారు. పేపర్ ట్రయల్‌ ఉండటం వల్ల సమస్యను గుర్తించగలిగామని.. లేదంటే ఏం జరిగేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను నివారించేందుకు పేపర్‌ బ్యాలెట్‌లను తీసుకురావాలని.. ఇలా చేస్తేనే ప్రతి ఒక్క ఓటును లెక్కించే అవకాశం ఉంటుందని చెప్పారు.

Also Read: ఇజ్రాయెల్ మీద హమాస్ ఎదురుదాడి..8 మంది సైనికులు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు