BIG BREAKING : తెలంగాణ సచివాలయంలో సునీల్ కనుగోలు.. రేవంత్ రెడ్డితో భేటీ

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్దామనే అంశంపై చర్చించేందుకు అతన్ని రేవంత్ పిలిపించుకున్నట్లు సమాచారం.

New Update
BIG BREAKING : తెలంగాణ సచివాలయంలో సునీల్ కనుగోలు.. రేవంత్ రెడ్డితో భేటీ

Sunil Kanugolu Meets CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు  తెలంగాణ సచివాలయంలో కనిపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy) తో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో (Parliament Elections) ఎలా ముందుకు వెళ్దామనే అంశంపై చర్చించేందుకు అతన్ని రేవంత్ పిలిపించుకున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే రేవంత్ ఇంట్లో కూడా వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

పార్లమెంటు ఎన్నికలు..
ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్‌ కనుగోలు రేవంత్ సర్కార్ ను గెలిపించడంతో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాగా అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ అతన్ని దూరం పెట్టేశాడని, సరిగా పట్టించుకోవడంతో సునీల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా బుధవారం సునీల్ తెలంగాణ సచివాలయంలో దర్శనమివ్వడం ఆసక్తిరంగా మారింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పట్ల స్పందన వంటి అంశాలపై రేవంత్‌రెడ్డితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : China: ‘ఇల్లు కొంటే భార్య ఫ్రీ’.. వింత ప్రకటన ఇచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీ..

పరిపాలన లోటుపాట్లపై చర్చ..
ఇక కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిన నేపథ్యంలో ప్రభుత్వం పట్ల ప్రజల ఆలోచన ఎలా ఉన్నదో రేవంత్‌రెడ్డికి సునీల్‌ కనుగోలు వివరించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ప్రభుత్వం ఇప్పటి వరకూ రెండింటిని మాత్రమే అమలు చేసింది. రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం వంటివి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటితోపాటు ఎన్నికల హామీలు కూడా నెరవేర్చాల్సి ఉండగా.. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలు, పరిపాలను సంబంధించి సునీల్ తో రేవంత్ సుధీర్ఘంగా చర్చినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు