Elections:రాజస్థాన్ లో పోలింగ్ షురూ..సాయంత్రం ఆరు వరకు పోలింగ్ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఉదయం 7 గంటల నుంచీ ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగనుంది. రాజస్థాన్ లో మొత్తం 199 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. By Manogna alamuru 25 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తో హడావుడిగా ఉంది. మొన్నటి వరకూ ప్రచారాలతో హోరెత్తిన రాజస్థాన్ భవితవ్యం నేడు ఓటర్లు తేల్చేయనున్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 199 కి మాత్రమే పోలింగ్ జరుగుతోంది. కరణ్ పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి గుర్మిత్ సింగ్ కున్నూర్ చనిపోవడంతో అక్కడ ఎన్నికల వాయిదా పడింది. రాజస్థాన్ లో 199 స్థానాల్లో మొత్తం 1862 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 5, 25,38,105 మంది ఓటర్లు ఉన్నారు. 36,101 పోలింగ్ స్టేషన్లలో 51,507 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కోసం 2,74,846 మంది సిబ్బంది పని చేస్తుండగా 1, 70 వేల మంది బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ మెయిన్ గా బీజేపీ , కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీనే గెలుపు తమది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ లో ప్రతీ టర్మ్ కు ఒక పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తూ వస్తున్నారు. దీన్ని బట్టి క్రితం సారి కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈ సారి తమకే ప్రజలు పట్టం కడతారని బీజేపీ అంటోంది. మరి జనాల ఆలోచన ఎలా ఉందో చూడాలి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాలకు ఒకేసారి ఫలితాలు వెల్లడి అవుతాయి. #elections #voters #polling #rajasthan #voting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి