Janasena Party Symbol: ఎన్నికల వేళ జనసేనకు ఈసీ బిగ్ షాక్ AP: జనసేనకు గాజుగ్లాస్ గుర్తు టెన్షన్ పట్టుకుంది. తాజాగా గాజుగ్లాస్ గుర్తుపై జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తు రిజర్వ్ చేయలేమని ఈసీ తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియ మొదలైందని.. ఇప్పటికే ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు ఈసీ వివరించింది. By V.J Reddy 02 May 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Election Commission On Janasena Party Symbol: ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీకి గాజుగ్లాస్ గుర్తు (Glass Symbol) టెన్షన్ పట్టుకుంది. గాజుగ్లాస్ గుర్తుపై జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీ వ్యాప్తంగా గుర్తు రిజర్వ్ చేయలేమని ఈసీ ఖరాఖండీగా చెప్పింది. ఇవాళ హైకోర్టుకు ఎన్నికల సంఘం ఇదే విషయాన్ని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ మొదలైందని.. ఇప్పటికే ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు ఈసీ వివరించింది. ముందస్తు పొత్తులను గుర్తించాలనే చట్టబద్దత లేదని పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్‌లను ఇప్పటికే పంపిణీ చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఈసీ వాదనలు వినిపించింది. అసలేమైంది.. జనసేన (Janasena) గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ. దీనిపై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ ఏ దశలో ఉందో చెప్పాలని ఈసీకి కోర్టు ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణ సాయంత్రం 4 గంటలకు న్యాయస్థానం వాయిదా వేసింది. Also Read: విషయం ఉన్న సినిమానే.. పక్కన ఎవరూ లేనప్పుడు చూడాల్సినంత ఘాటు సినిమా! #ap-elections-2024 #janasena-party #election-commission #janasena-party-symbol మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి