AP Politics : జమ్మలమడుగులో అల్లర్లు... ముగ్గురిని ఊరు దాటించిన పోలీసులు! ఏపీ లో ఎన్నికల సమయంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ సంఘటనల గురించి ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కడప జిల్లా జమ్మలమడుగులో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల కదలికలపై ఫోకస్ పెట్టారు. By Bhavana 18 May 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Ap Politics : ఏపీ లో ఎన్నికల(AP Elections) సమయంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉండగానే ఈ ఘటనలు జరగడం పట్ల ఎలక్షన్ కమిషన్(EC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత అధికారుల పై ఈసీ వేటు కూడా వేసింది. కఠిన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత 15 రోజులు వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అవసరమైతే భారీగా కేంద్రబలగాలను వినియోగించుకోవాలని సూచించింది. దీంతో పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఊరు దాటిస్తున్నారు. వారి ఇళ్ల వద్ద భారీగా మోహరించారు. కడప జిల్లా జమ్మలమడుగులో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల కదలికలపై ఫోకస్ పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిని హైదరాబాద్ తరలించారు. కడప టీడీపీ(TDP) ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని బనగానపల్లికి పంపారు. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆది నారాయణరెడ్డిని హైదరాబాద్కు పంపించారు. మూడు రోజులుగా ఈ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. గ్రామంలో ఉంటే మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని వీరిని బయట ప్రాంతాలకు తరలించారు. Also read: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల..రిజల్ట్స్ కోసం ఈ లింక్ లో చెక్ చేసుకోండి! #election-commission #kadapa #tdp #ycp #ap-politics-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి