Telangana : గూడెం అక్రమాలు రూ. 300 కోట్లు - ఈడీ

పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి .. మైనింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.39కోట్లు నష్టం చేకూర్చినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గుర్తించారు. మొత్తం రూ.300 కోట్ల మైనింగ్‌ అక్రమాలు జరిగినట్టు అధికారులు నిర్ధారించారు.

New Update
Telangana : గూడెం అక్రమాలు రూ. 300 కోట్లు - ఈడీ

Gudem Brothers Mining Mafia : గూడెం సోదరుల అక్రమాలు బయటపడ్డాయి. దీని మీద దర్యాప్తు చేపట్టిన ఈడీ (ED) అసలు లెక్కలను బయటకు తీసింది. పటాన్‌చెరు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (Gudem Mahipal Reddy) ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డిలు 300 కోట్ల రూపాయల మైనింగ్‌ అక్రమాలకు (Mining Mafia) పాల్పడ్డారని తేల్చారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.39 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ తన నివేదికలో చెప్పింది.

సంతోష్ శాండ్‌, సంతోష్ గ్రానైట్‌ కంపెనీల ద్వారా ఈ అక్రమాలు జరిగాయని ఈడీ పేర్కొంది. మైనింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన మహిపాల్‌రెడ్డి సోదరుల నివాసాల్లో సోదాల సమయంలో ఈడీ రూ.19 లక్షల నగదు గుర్తించింది. సోదాలకు సంబంధించి శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్‌, హవాలా నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్టు తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను గుర్తించింది. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టారని ఈడీ వివరించింది. బినామీ పేర్లతో లావాదేవీలను గుర్తించామని, మరి కొన్ని బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. మహిపాల్‌రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్టు దర్యాప్తులో తేలిందని తెలిపారు.

Also Read:జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు

Advertisment
తాజా కథనాలు