Aravind Kejriwal : ఇవాళ అందరి చూపులూ ఢిల్లీ మీదనే ఉన్నాయి. రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) లో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతే. ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Kejriwal) కస్టడీ ఈరోజుతో ముగియనుండడంతో ఈడీ(ED) ఈరోజు ఆయనను కోర్టులో హాజరపర్చనుంది. మధ్యాహ్నం 2గంటలకు కేజ్రీవాల్‌ను కోర్టుకు తీసుకెళ్ళనున్నారు. విచారణ తర్వాత కోర్టు కేజ్రీవాల్ కస్టడీ పొడిగిస్తుందా... లేదంటే రిమాండ్ కు తరలించాలని ఆదేశిస్తుందా అనేది చూడాలి. అదీ కాకుండా ఈరోజు కేజ్రీవాల్ కోర్టులో ఏం చెప్పనున్నారు అనే దాని గురించి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కోర్టులో ఏం చెప్పబోతున్నారు?
నిన్న కేజ్రీవాల్ భార్య ప్రకటనతో ఇప్పుడు అందరూ ఆయన ఈరోజు కోర్టులో ఏం చెప్పబోతున్నారు అనేది చర్చించుకుంటున్నారు. కేజ్రీవాల్ నిజంగానే కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) గురించి సంచలన విషయాలను బయటపెడతారా? ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి కూడా మాట్లాడతారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. అసలు కేజ్రీవాల్‌కు ఈ కేసు గురించి ఏం తెలుసు? ఇందులో ఎవరెవరు ఉన్నారు? లాంటి విషయాలు బయటకు వస్తాయామో అని అనుకుంటున్నారు. దాంతో పాటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురించి కూడా ఏం చెబుతురోనన్న చర్చ తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సాగుతోంది. కేజ్రీవాల్ తన వాదనలో కవిత నిర్దోషి అని చెబితే.. ఆమెకు మద్దతు మరింత పెరిగే అవకాశం ఉంది.
లిక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడ?
లిక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడ ఉన్నాయో కేజ్రీవాల్ రేపు చెబుతారని ఆయన సతీమణి సునీత ఈ రోజు విడుదల చేసిన వీడియోలో వెల్లడించడం కూడా ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచీ కేజ్రీవాల్ ఇదంతా బీజేపీ కుట్రని చెబుతున్నారు. ఇప్పుడు రేపు కోర్టులో కేజ్రీవాల్ కూడా అదే చెబుతారా? బీజేపీ వాళ్ళ దగ్గరే డబ్బులు అన్నీ ఉన్నాయని ఆయన ప్రకటిస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
మళ్ళీ కస్టడీ కోరనున్న ఈడీ..
మద్యం కుంభకోణం కేసులో సౌత్ గ్రూప్ పాత్రపై ఈడీ ఆరా.. కవితను ఎప్పుడు కలిశారు? ఎందుకు కలిశారు?
కేజ్రీవాల్‌కు ముడుపులు ఎలా అందాయి? అన్న అంశాలపై ఈరోజు రౌస్ అవెన్యు కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాల మీదనే మరోసారి కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీ మరోసారి కస్టడీ కోరనుంది.
మరోవైపు నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం సడెన్‌గా అప్సెట్ అయింది. ఆయన షుగర్ లెవల్స్ బాగా డ్రాప్ అయిపోయాయి. దీనిని గమనించిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని.. షుగర్ లెవల్స్ 46కు పడిపోయాయని తెలిపారు.
Also Read : Google : గూగుల్‌లో 1.2 ఖాతాల తొలగింపు.. ఏఐ మోసగాళ్ళకు చెక్