Breaking : కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన ఈడీ అధికారులు!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లిన ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. మనిలాండరింగ్ కేసుకు సంబంధించిన ఇష్యూలో ఆమెను జడ్జి ఎమ్ కే నాగ్ పాల్ ముందు హాజరు పరిచారు.

New Update
Breaking : కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన ఈడీ అధికారులు!

Delhi : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) ను లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case) లో అరెస్ట్ చేసి ఢిల్లీ(Delhi) తీసుకెళ్లిన ఈడీ(ED) అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. మనిలాండరింగ్ కేసుకు సంబంధించిన ఇష్యూలో ఆమెను జడ్జి ఎమ్ కే నాగ్ పాల్ ముందు హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేశారు.

కస్టడీలోకి కవిత..
శనివారం ఉదయం రెండుసార్లు వైద్య పరీక్షలు(Medical Tests) నిర్వహించిన అనంతరం ఆమెను కోర్టు ఎదుట ప్రవేశ పెట్టారు. అయితే కోర్టులో హాజరయ్యే ముందు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని కవిత వాపోయారు. చట్ట విరుద్ధంగా  చేసిన అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. తనది ఇల్లీగల్ అరెస్ట్ అని, రెండు రోజుల్లో బయటకు వస్తానని అన్నారు. ఇక ఈడీ అధికారులు కవితను 10 రోజుల కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది.

Also Read : కవిత అరెస్ట్… విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు