ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ రాహుల్, సోనియా గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రూ.752కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని రాహుల్, సోనియా ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ చర్యపై దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ డైరెక్షన్ లోనే ఎన్నికల వేళ ఈడీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు.
మనీలాండరింగ్ కేసులో AJL & యంగ్ ఇండియన్ ఆస్తులను ED అటాచ్ చేయడంపై, కాంగ్రెస్ నాయకుడు మాణికం ఠాగూర్ ఇలా అన్నారు, "నేషనల్ హెరాల్డ్ ఆస్తులను లాక్కోవాలని మోదీ ఆదేశాల మేరకు ED చర్య చట్టవిరుద్ధమైన చర్య... రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు మోదీకి తగిన సమాధానం ఇస్తారు." అని అన్నారు.