Landy Parraga Goyburo : ఈక్వేడర్‌ బ్యూటీ క్వీన్ హత్య.. కారణం ఇదే

ఇటీవల ఈక్వేడార్‌లో సోషల్ మీడియా ఇన్‌ప్లుయేన్సర్‌ అయిన లాండీ పర్రాగా గోయ్‌బురోను ఇద్దరు దుండగులు తుపాకితో కాల్చి చంపడం దుమారం రేపుతోంది. ఆమెకు ఓ డ్రగ్‌ డీలర్‌తో అక్రమ సంబంధం ఉందని.. ఈ హత్య వెనుక ఆయన భార్య హస్తం ఉందని తెలుస్తోంది.

New Update
Landy Parraga Goyburo : ఈక్వేడర్‌ బ్యూటీ క్వీన్ హత్య.. కారణం ఇదే

South America : ఇటీవల సౌత్‌ అమెరికాలోని ఈక్వేడార్‌లో సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్‌(Social Media Influencer) అయిన లాండీ పర్రాగా గోయ్‌బురో(Landy Parraga Goyburo) ను ఇద్దరు దుండగులు తుపాకితో కాల్చి చంపడం దుమారం రేపుతోంది. ఆమె హత్యకు ముందు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తన ఫొటోను అప్‌లోడ్ చేయడంతో.. లోకేషన్‌ గుర్తించిన దుండుగులు ఆమెపై కాల్పులు జరిపారు. అయితే ఆమె హత్య వెనుక ఓ డ్రగ్‌ డీలర్ భార్య హస్తం తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 28న క్వివేడోలో ఓ రెస్టారెంట్‌లో లంచ్ చేసేందుకు పర్రాగా గోయ్‌బురో వచ్చారు. ఆ సమయంలో ఆమె ఆ చోటుకి వచ్చినట్లు ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Also Read: రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ.. అమేథీని కాదని అక్కడే ఎందుకు?

ఆ తర్వాత ఇద్దరు దుండుగులు రెస్టారెంట్‌లోకి దూసుకొచ్చి ఆమెను కాల్చి చంపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ పుటేజ్‌లో కూడా రికార్డ్ అయ్యాయి. అయితే పర్రాగా గోయ్‌బురోకు లియాండ్రో నోరెరో అనే ఓ డ్రగ్‌ డీలర్‌తో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అతడు జైల్లో జరిగిన అల్లర్లలో మరణించాడు. అయితే లియాండ్రో భార్యనే ఈ హత్య(Murder) కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. గతంలో గోయ్‌బురో పేరు.. ఓ అవినీతి కేసులో కూడా వినిపించింది.

అంతేకాదు డ్రగ్‌ డీలర్‌ అయిన నోరెరా ఫోన్‌లో కూడా గోయ్‌బురో ఫొటోలను అధికారులు గుర్తించారు. అలాగే అతడు ఆమెకు కార్లతో పాటు ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు ఆధారాలు లభించాయి. ఇదిలాఉండగా.. 2022 జరిగిన మిస్‌ ఈక్వేడార్‌ పోటీల్లో గోయ్‌బురో పాల్గొన్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 173,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏప్రిల్ 28న ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు క్వెవెడో నగరానికి వచ్చింది. కానీ అంతలోనే ఆమె హత్యకు గురవ్వడం సంచలనం రేపింది.

Also Read: నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అరెస్టు.. పాక్‌ ఐఎస్‌ఐతో సంబంధాలు

#telugu-news #landy-parraga-goyburo #ecuador #crime news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు