Power Supply: ఆ దేశం మొత్తం నిలిచిపోయిన కరెంట్.. స్తంభించిన జనజీవనం

దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో దేశం మొత్తం ఒకేసారి కరెంటు పోయింది. దీంతో కొన్నిగంటలు పాటు అన్ని రకాల వ్యవస్థలు నిలిచిపోయవడంతో జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్తు నిర్వహణలో సమస్యల కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

New Update
Power Supply: ఆ దేశం మొత్తం నిలిచిపోయిన కరెంట్.. స్తంభించిన జనజీవనం

గ్రామంలో కరెంట్ పోవడం, పట్టణంలో కరెంటు పోవడం.. ఆఖరికి నగరంలో కూడా కరెంటు పోవడం విన్నాం చూశాం. అయితే దేశం మొత్తం ఒకేసారి కరెంట్ పోతే ఎలా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలపాలు, ఆస్పత్రులు, రైల్వే వ్యవస్థలు ఇలా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి. దేశం మొత్తం స్తంభించిపోతుంది. ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది కదా. అలాంటి సంఘటన ఇప్పుడు నిజంగానే జరిగింది. దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో ఇది జరిగింది.

Also Read: తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్

బుధవారం రోజున దేశం మొత్తం ఒకేసారి కరెంటు సరఫరా ఆగిపోయింది. దీంతో కొన్ని గంటల పాటు అన్ని రకాల వ్యవస్థలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. అయితే విద్యుత్తు నిర్వహణ, ట్రాన్స్‌మిషన్‌లో సమస్యల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు తెలిపారు. కొత్త పంపిణీ వ్వవస్థ ఏర్పాటుకు.. దాని నిర్వహణకు నిధుల కేటాయింపు లేకపోవడం వల్లే ఈరోజు దేశంలో విద్యుత్‌ వ్యవస్థ నిలిచిపోయిందని పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి రాబర్టో లూక్యూ అన్నారు.

కొన్ని గంటల పాటు దేశ మొత్తం మొత్తం అంధకారంలో ఉండగా.. చివరికి బుధవారం అర్ధరాత్రికి దేశంలో 95 శాతం ప్రాంతాలకు కరెంట్‌ వచ్చింది. 2004లో కూడా ఈక్వేడర్‌లో ఇలా దేశమంతటా విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలింది. ఇదిలాఉండగా.. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈక్వేడర్‌.. విద్యుత్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు ప్రస్తుతం అక్కడ ఎనిమిది గంటల పాటు కరెంటు కోతలు ఉండటం గమనార్హం.

Also Read: అక్కడ ప్రార్ధన మందిరాలు సహా 1200 అక్రమ కట్టడాల కూల్చివేత 

Advertisment
తాజా కథనాలు