Assembly Elections: సీఎం ప్రచారాన్ని నిలిపేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎందుకంటే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఈనెల 17న అక్కడ ఎన్నికలు జరగనున్న వేళ.. బుధవారం సాయంత్రం 6 తర్వాత ప్రచారానికి అనుమతి లేదు. సమయం దగ్గరికొచ్చినా సీఎం ప్రచారం చేయగా అధికారులు అడ్డుకున్నారు. By B Aravind 15 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగా మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. అక్కడ ఈ నెల 17వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈసీ నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారానికి అనుమతి లేదు. కానీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ మాత్రం సమయం దగ్గరికి వస్తున్నా కూడా తన ప్రచారాన్ని ముగించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు సీఎం ప్రచారం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి ప్రచారాన్ని ఆపేయాలంటూ ఆదేశించారు. Also Read: పదేళ్ల బాలుడిని క్రూరంగా చంపేసిన కోతులు.. కడుపులోంచి పేగులు లాగి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలాంటి ప్రచారాలు నిర్వహించరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలాఉండగా.. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు ఒకే విడుతలో పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో కమల్‌నాథ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడ్డ జ్యోతిరాధిత్య సింథియా 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. దీంతో కమల్‌నాథ్ సర్కార్ కూలిపోయింది. చివరికి శివరాజ్‌సింగ్ చౌహన్ ముఖ్యమంత్రిగా బీజేపీ సర్కార్ ఏర్పాటైంది. ఇప్పుడు జరగనున్న ఎన్నిక్లలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఏ పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుంది అనేదానిపై ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. Also Read: రష్మిక డీప్‌ఫేక్ వీడియో ఫస్ట్ అప్ లోడ్ చేసింది ఇతడే.. వెల్లడించిన ఢిల్లీ పోలీసులు #telugu-news #national-news #assembly-elections #madhya-pradesh-assembly-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి