/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-18T195602.703.jpg)
Fifth Phase Polling : లోక్‌సభ ఆరో దశ ఎన్నికల (Lok Sabha Sixth Phase Elections) పోలింగ్ (Polling) శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఆరు రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 58 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు 57.7 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ (EC) వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో 77.99 ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలిపింది. ఇదిలాఉండగా.. లోక్‌సభ ఎన్నికల తొలి ఐదు దశలకు సంబంధించి ఓట్ల వివరాలను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలను తమ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.
Also read: ఆ హీరోలంతా స్వలింగ సంపర్కులే.. ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న సింగర్ కామెంట్స్!
దేశంలో ఎన్నికల ప్రక్రియకు హాని కలిగించేలా తప్పుడు వార్తలు వస్తున్నాయని ఈసీ ఆరోపణలు చేసింది. ఈవీఎంలలో పోలైన ఓట్ల సంఖ్యలో మార్పులు చేయడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఓటింగ్ ముగిశాక 48 గంటల్లోగా ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో విడుదల చేయాలని అభ్యర్థిస్తూ.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)’ ఇటీవలే సుప్రీకోర్టు (Supreme Court) లో పిటిషన్ వేసింది. అయితే మరో రెండు దశలు మిగిలి ఉండటంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈసీకీ ఆదేశాలు ఇవ్వలేమని.. న్యాయస్థానం చెప్పింది. అయినప్పటికీ.. తొలి ఐదు దశల ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల గణాంకాలను తాజాగా ఈసీ తమ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.
Also read: ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
Commission releases absolute number of voters for all completed phases of General Elections 2024
Details :https://t.co/z0QVHGM41Z
— Spokesperson ECI (@SpokespersonECI) May 25, 2024