Election Commission: 'రాహుల్‌ జాగ్రత్తగా మాట్లాడండి'.. కీలక సూచనలు చేసిన ఎన్నికల సంఘం

ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని కేంద్ర ఎన్నికల సంఘం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచనలు చేసింది. గతంలో రాహుల్‌.. ప్రధాని మోదీని ఉద్దేశించి పనౌతి, పిక్‌ పాకెట్‌ వంటి వ్యాఖ్యలు చేయడంతోనే ఈసీ ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

Rahul Gandhi: ప్రతి నెల ఉచితంగా 10 కిలోల బియ్యం.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన
New Update

కేంద్ర ఎన్నికల సంఘం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పలు సూచనలు చేసింది. ప్రజాక్షేత్రంలో ఉన్న సమయంలో.. ఆచితూచి మాట్లాడాలంటూ తెలిపింది. అయితే గతంలో రాహుల్‌.. ప్రధాని మోదీని ఉద్దేశించి పనౌతి, పిక్‌ పాకెట్‌ వంటి వ్యాఖ్యలు చేయడంతోనే ఈసీ ఈ మేరకు సూచనలు చేసినట్లు పలు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో నేతలు, స్టార్ క్యాంపెయినర్లు పాటించాల్సిన తీరుపై గతంలో జారీ చేసిన అడ్వైజరీని అనుసరించాలని చెప్పింది.

Also read: పెళ్లి చేసుకునేందుకు గ్యాంగ్‌స్టర్‌కు 6 గంటల పాటు పెరోల్

అయితే గతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ.. ప్రధానిని పనౌతి(దురదృష్టవంతుడు), పిక్‌ పాకెట్ అంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. దీంతో 2023 నవంబర్‌ 23న ఎలక్షన్ కమిషన్ రాహుల్‌కు నోటీసులు పంపించింది. అంతేకాదు ఆయన చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందుకోసం నోటీసులపై చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది.

లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలోనే ఎన్నికల సంఘం తాజాగా రాహుల్‌కు ఈ సచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలంటూ సూచించింది. గతంలో వ్యాఖ్యలు చేసినట్లుగా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపింది. అలాగే గతంలోనే నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థుల ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినట్లుగా మళ్లీ చేస్తే.. తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరిచ్చింది.

Also Read: ఏఐ రోబో టీచర్‌ వచ్చేసిందోచ్‌.. ఎక్కడంటే

#telugu-news #rahul-gandhi #national-news #election-commission #eci
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe