Summer Food: వేసవిలో ఇవి తింటే శరీరంలోని నీరంతా మాయం..జాగ్రత్త వేసవిలో సమోసా, పిజ్జా, బర్గర్ వంటి వేయించిన ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. టీ, కాఫీకు కూడా దూరంగా ఉండాలి. సీఫుడ్, మాంసం, పౌల్ట్రీ తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ వాటిని వేసవిలో ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 26 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Summer Food: ఎండాకాలం వచ్చిందంటే శరీరంలోని నీరంతా ఆవిరై డీహైడ్రేషన్ సమస్య తప్పదు. ఈ కాలంలో తినే ఆహారంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ సీజన్‌లో ప్రజలు సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్, డీహైడ్రేషన్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా తగినంత నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందని సలహా ఇస్తున్నారు. జంక్ ఫుడ్: వేసవిలో సమోసా, పిజ్జా, బర్గర్ వంటి వేయించిన ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది. వేసవిలో వేయించిన ఆహారానికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు. ఈ ఆహారాలు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయని, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్లు శరీరానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు. టీ, కాఫీ: టీ, కాఫీ మనసును తాజాగా ఉంచుతాయి కాబట్టి చాలా మంది ఉదయం సాయంత్రం తెగ కాఫీ, టీలు తాగేస్తుంటారు. కానీ పరిమిత పరిమాణంలో కెఫిన్ వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి వేసవికాలంలో ఎక్కువగా తీసుకుంటే శరీరాన్ని వేడి చేసి డీహైడ్రేషన్‌కు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. మాంసాహారం: సీఫుడ్, మాంసం, పౌల్ట్రీ తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ వాటిని వేసవిలో ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. ఎండాకాలం వాటిని సరిగా నిల్వ చేయకపోతే అవి త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే వీటికి దూరంగా ఉండటమే మంచిది. మద్యం: ఆల్కహాల్ శారీరక, మానసిక సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా హైపోథాలమస్ గ్రంధి పనిని తగ్గిస్తుంది. వేసవిలో మద్యం తాగితే డీహైడ్రేషన్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మసాలా ఆహారాలు: ప్రజలు సాధారణంగా స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడతారు. వేసవిలో మసాలా ఆహారాలు తీసుకుంటే జీవక్రియలో ఇబ్బంది కలగడమే కాకుండా శరీరంలో కూడా వేడి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: వెస్ట్రన్ కంటే ఇండియన్ టాయిలెట్స్‌తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #best-health-tips #summer-food మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి