Fruits for Bacterial Infection: వాతావరణంలో మార్పుల కారణంగా..వైరల్, బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రతిఒక్కరూ దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. అక్టోబర్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణంలో మార్పుల కారణంగా ఎంతో మంది రోగాల బారిన పడ్డారు. ఇప్పుడు చలి కూడా మొదలుకానుంది. అందువల్ల చాలా మందిలో వైరల్, ఫ్లూ, కళ్లు,ముక్కు, దగ్గు వంటి సమస్యలు పెరుగుతాయి.
నిజానికి బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్నవారిలో ఇలాంటి వ్యాధులు వెంటనే ప్రభావం చూపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బయటి సూక్ష్మ క్రిములను శరీరంలోకి ప్రవేశించనివ్వదు. కానీ వాతావరణంలో మార్పులు, గాలిలో తేమ పెరిగిన వైరస్ లు, బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిపై దాడి చేస్తాయి. అయితే వీటిని నివారించేందుకు పండ్లు ఎంతో సహాయపడతాయి.
1. దానిమ్మ (Pomegranate):
మారుతున్న సీజన్ లో దానిమ్మ వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మలో విటమిన్ సి తోపాటు అనేక రకాల ఖనిజాలు, యాంటీయాక్సడెంట్లు, పాలిఫెనాల్స్ ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి రక్షణకవచంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి దూరంగా ఉంచుతాయి. అనేక రకాల వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వాపు కారణంగానే సంభవిస్తుంటాయి. ఇది ఇమ్యూనిటి(Immunity)ని పెంచుతుంది. అంతేకాదు వ్యాధుల దాడి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే మీ డైట్లో దానిమ్మను చేర్చుకోవడం చాలా మంచిది.
ఇది కూడా చదవండి: కేసీఆర్ మిస్సింగ్.. ఏ క్షణమైనా బీఆర్ఎస్ చీలే ప్రమాదం: బండి సంజయ్ సంచలన వాఖ్యలు
2. సిట్రస్ పండ్లు (Citrus Fruits):
సిట్రస్ పండ్లను విటమిస్ కి స్టోర్ హౌజ్ అంటారు. ఇమ్యూనిటి వ్యవస్థకు విటమిన్ సి (Vitamin C) ఎంతో ముఖ్యమైంది. సాధారణంగా ప్రజలు జలుబు, దగ్గు కోసం సిట్రస్ పండ్లను దూరంగా ఉంచుతారు. కానీ శాస్త్రీయ పరంగా సిట్రస్ పండ్లు, జలుబు,దగ్గుకు మంచివి. ఎందుకంటే విటమిన్ సి నేరుగా ఇమ్యూనిటీని పెంచుతుంది. జలుబు, దగ్గుతో పోరాడేందుకు తెల్ల కణాలను పెంచుతుంది. సిట్రస్ లో నారింజ, నిమ్మ, దానిమ్మ, కివి, ఉన్నాయి.
3. బొప్పాయి (Papaya):
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. వైరల్ లేదా బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బొప్పాయిలో పొటాషియం, మెగ్నీషియం, ఫొటేల్ ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి.
ఇది కూడా చదవండి: ఇలాంటి అబ్బాయిలను అమ్మాయిలు అసలు వదులుకోరట.. మరి మీ సంగతేంటి?
4. కివి (Kiwi):
కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటితోపాటు పొటాషియం, విటమిన్ కె, ఫొలేట్ బి ఇందులో లభిస్తాయి. ఇది ఇన్ఫెక్షన్ తో పోరాడేందుకు సిద్ధంగా ఉంటుంది. తెల్లరక్తకణాలను పెంచుతుంది.
5. జామ (Guava):
అక్టోబర్ నుంచి జామకాయలు మార్కెట్లో విరిగా లభిస్తాయి. జామలో విటమిన్ సి మాత్రమే కాదు..అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి రోగాల నుంచి మనల్ని కాపాడతాయి.