Maida Flour: మనం తినే పిండి పేగులకు అంటుకుంటుందా..? ఇది నిజమేనా..? వండిన తర్వాత పిండిని తింటే.. అది సులభంగా కడుపులో కరిగిపోతుంది. పిండి పేగులకు అంటుకోవడమన్నది అపోహ మాత్రమే. అయితే పిండితో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినేప్పుడు వీలైనన్ని ఎక్కువ కూరగాయలు తినాలి. ఇక పిండి ఎక్కువ తినడం మంచిది కాదు. అనేక రోగాలు వస్తాయి. By Vijaya Nimma 03 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Maida Flour: పిండి అంటే తేలియ వాళ్లు ఉండదు. ప్రతి వంటల్లోనూ పండిని ఎక్కువగా వాడేస్తారు. ప్రస్తుత కాలంలో మార్కెట్ ఎన్నో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. వాటిని చాలా రకాల పిండితో తయారు చేస్తారు. ఇలా చేసిన ఆహార పదార్ధాలను తిన్న తర్వాత పిండి పేగులకు అంటుకుంటుందనే అపోహ ప్రతిఒక్కరిలో ఉంటుంది. ఇది నిజంగా జరుగుతుందా..? అని ప్రశ్న ఉంటుంది. ప్రస్తుతం పిల్లలు, యువత బయటి ఆహారాన్ని ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు. కానీ.. బయట తినడానికి చేసేవి చాలా వరకు పిండితో చేసినవే ఉంటాయి. అది పిజ్జా, చోలే భతుర్, మోమోస్ కావచ్చు. పిండి ఎక్కువగా తినడం శరీరానికి మంచిది కాదు. పిండిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అంతేకాదు పేగులకు అంటుకునే పిండికి దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. అయితే పిండి నిజంగా పేగుల్లో అంటుకుంటుందా..? లేదా..? అనే దానిపై నిపుణులు ఏంటున్నారో, బయట పిండి పదార్ధాలు తినటంపై కొన్ని విషయాలు తెలుసుకుందాం. కడుపులో కరిగిపోతుంది, జీర్ణమవుతుంది: పిండి గురించి సాధారణ అపోహ ఏమిటంటే అది తిన్న తర్వాత ప్రేగులకు అంటుకుంటుంది. దీనికి సంబంధించి పోషకాహార నిపుణుల ప్రకారం పేగుల్లో పిండి అంటుకోదని పోషకాహార నిపుణులు చెప్పారు. దీని ప్రధాన కారణం ఏమిటంటే.. మనం పిండి తినేటప్పుడు, అది వండిన తర్వాత తింటాము. వండిన తర్వాత పిండిని తింటే.. అది సులభంగా కడుపులో కరిగిపోతుంది, జీర్ణమవుతుందంటున్నారు. అందుకే పిండి పేగులకు అంటుకుంటుందని అంటారు. ఇది తప్పు.. అయితే పిండి ఎక్కువగా తింటే.. అప్పుడు మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఎందుకంటే పిండిలో చాలా తక్కువ పీచు ఉంటుంది. ఇందులో ఎక్కువ స్టార్చ్ ఉంటుంది. దీనివల్ల ఎసిడిటీ, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.సులభంగా జీర్ణమవుతాయి: ఏదైనా కొంతగా తీసుకుంటే ఎలాంటి సమస్య రావు. కానీ పిండితో చేసిన వస్తువులను తినేటప్పుడు వీలైనన్ని ఎక్కువ కూరగాయలు తినాలి. ఎందుకంటే గోధుమ నుంచి పిండి చేసినప్పుడు. అప్పుడు దాని నుంచి ఫైబర్ తొలగించబడుతుంది. ఫైబర్ లేకపోవడం వల్ల.. దాని జీర్ణక్రియలో ఇబ్బంది ఉంది. కూరగాయలలో ఫైబర్ ఉంటుంది కావున కూరగాయలు తిన్న తర్వాత, అవి సులభంగా జీర్ణమవుతాయి. అయితే మైదా తిన్న తర్వాత ఏదైనా కడుపు సంబంధిత సమస్య వస్తే ఖచ్చితంగా డాక్టర్లను సంప్రదించాలని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఎండల్లో చర్మం నల్లబడకుండా.. ఇలా చేయండి.. మెరిసిపోవడం ఖాయం గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #best-health-tips #maida-flour మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి