Potatoes Tips: ప్రతి ఇంట్లో వంట కోసం ఎక్కువగా బంగాళాదుంపలు ఉపయోగిస్తూ ఉంటారు. అన్ని వయసుల వారు బంగాళాదుంపలు తినడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు. కేవలం కూరకే కాకుండా ఎన్నో రకాల వంటకాలు చేసుకునేందుకు బంగాళాదుంపలు ఉపయోగపడతాయి. అయితే ఒక నెల రోజులు బంగాళాదుంపలు తినడం ఆపితే మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు.
బరువు అదుపులో ఉంటుంది:
- బంగాళదుంపలలో అద్భుతమైన శక్తి లభిస్తుంది. దీంతో శరీరానికి మంచి క్యాలరీలు అందుతాయి. సాధారణంగా బంగాళదుంపల తయారీలో ఎక్కువ నూనెను ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో బంగాళాదుంపలు తినడం మానేస్తే బరువును నియంత్రించవచ్చని నిపుణులు అంటున్నారు.
బ్లడ్ షుగర్ కంట్రోల్:
- బంగాళాదుంప రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. అందుకే తినడం మానేస్తే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలను తినకూడదని వైద్యులు అంటున్నారు.
అధిక బీపీ, గుండె జబ్బులు:
- బంగాళాదుంపల చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్‌లో సోడియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే బంగాళాదుంపలకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు అంటున్నారు.
బంగాళా దుంపలకు బదులు ఇవి తినండి:
- విటమిన్ సి, విటమిన్ B6తో పాటు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు బంగాళాదుంపలలో కనిపిస్తాయి. బంగాళాదుంపలు తినడం మానేయాలనుకుంటే బదులుగా చిలగడదుంపలను మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. కావాలంటే కాలీఫ్లవర్, టర్నిప్ లేదా అరటిపండును కూడా తినవచ్చు.
ఇది కూడా చదవండి : అత్తమామలతో తగాదాలను పరిష్కరించుకోవడం ఎలా.. ఇలా నడుచుకోండి
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.