Moong Dal: కప్పు పెసరపప్పులో ఎంత ప్రొటీన్ ఉంటుంది?..అనేక వ్యాధులు దూరం ఎన్నో వ్యాధులను నయం చేయగల సత్తా కేవలం పెసరపప్పుకే ఉంది. మాంసం, గుడ్లలో ఉండే ప్రొటీన్ ఇందులో లభిస్తుంది. 100 గ్రాముల పెసరపప్పులో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక పెసరపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. By Vijaya Nimma 21 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Moong Dal: తృణధాన్యాలు మన ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతాయి. అందులో ముఖ్యమైనది పెసరపప్పు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో వ్యాధులను నయం చేయగల సత్తా కేవలం పెసరపప్పుకే ఉంది. మంచి ఆహారం తీసుకుంటే అనేక వ్యాధులు దూరమవుతాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు, పప్పులు మొదలైన సమతుల్య ఆహారంలో అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. వీటిలో ఒకటి పెసరపప్పు ఒకటి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పెసర పప్పులో సాధారణంగా ఇతర పప్పుల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఒక గిన్నె (100 గ్రాములు) పప్పులో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మాంసం, గుడ్లలో ఉండే ప్రొటీన్ ఇందులో లభిస్తుందని నిపుణులు అంటున్నారు. పెసర పప్పు ఇలా తీసుకోండి: పెసర పప్పును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు అతనికి పెసరపప్పు సూప్ ఇస్తే ప్రోటీన్ లభిస్తుందని. ఆ వ్యక్తి త్వరగా కోలుకుంటాడని వైద్యులు అంటున్నారు. మొలకల రూపంలో పెసరపప్పును తినవచ్చు. అంతేకాకుండా ఖిచ్డీ, సలాడ్, పాపడ్, సూప్ కూడా చేసుకోవచ్చు. దీని వినియోగం శరీరం శక్తి స్థాయిని పెంచుతుంది. కండరాలను నిర్మించడంలో, బలహీనతను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పెసరపప్పు ప్రయోజనాలు: ఇందులో విటమిన్ బి, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఈ పప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా పెసరపప్పు సహాయపడుతుందని అంటున్నారు. ఇది కూడా చదవండి: ఏ వయసు వారు హెడ్‌ఫోన్స్‌ని ఎంత సమయం వాడవచ్చు? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #moong-dal #best-helath-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి