Raw Onion : ఈ సమస్యలు ఉన్న పురుషులు పచ్చి ఉల్లిపాయలు తినాల్సిందే

పచ్చి ఉల్లిపాయలతో పాటు కొద్దిగా బెల్లం తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయలో ఉండే సల్ఫైడ్ అనే సహజ మూలకం పురుషులలో లైంగిక సమస్యలను పోగొడుతుంది. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రిస్తుందని చెబుతున్నారు.

New Update
Raw Onion : ఈ సమస్యలు ఉన్న పురుషులు పచ్చి ఉల్లిపాయలు తినాల్సిందే

Raw Onion Benefits : ఈ రోజుల్లో ప్రతి కూరలో ఉల్లిపాయ ఉండాల్సిందే. అయితే పురుషులు కొన్ని పచ్చి ఉల్లిపాయలు(Raw Onions) తింటే వారి ఆరోగ్యానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) లభిస్తాయని నిపుణులు అంటున్నారు. ఉల్లితో కళ్లు చెమ్మగిల్లడం తప్ప మరే ఇతర ఆరోగ్య సమస్యలూ ఉండవు. కళ్లలో నీళ్లు తెప్పించినా మనిషికి వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను నయం చేసే గుణాలన్నీ ఉల్లిపాయలో ఉన్నాయి. అందుకే ఉల్లిచేసే మేలు తల్లికూడా చేయదనే సామెత వచ్చింది. ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలతో పాటు కొద్దిగా బెల్లం తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఉల్లిపాయల్లో మనిషి ఆరోగ్యానికి అవసరమైన అనేక ఔషధ మూలకాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, సల్ఫర్ కంటెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా దీనిలో ఉంటాయి.

పురుషుల లైంగిక సమస్యలను తొలగిస్తుంది:

  • ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ ను సహజంగా పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి లైంగిక సమస్యలు ఉన్న పురుషులు ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసాన్ని అల్లం రసంలో కలిపి తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు.

సల్ఫైడ్ ఒక సహజ మూలకం:

  • ఉల్లిపాయలో ఉండే సల్ఫైడ్ అనే సహజ మూలకం పురుషులలో లైంగిక సమస్యలను(Relationship Problems) పోగొడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రిస్తుంది. లైంగిక ఆసక్తిని పెంచడంలో పరోక్షంగా సహాయపడుతుంది.

అధిక రక్తపోటు:

  • చాలామంది పురుషులు అధిక రక్తపోటు(Blood Pressure) తో బాధపడుతున్నారు. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ కొద్ది మొత్తంలో ఉల్లిపాయను తీసుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తపోటును నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి:

  • టెస్టోస్టెరాన్(Testosterone) హార్మోన్ లైంగిక కోరికను పెంచుతుంది. పురుషులలో స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ హార్మోన్ స్థాయి క్షీణించడం ప్రారంభిస్తే వంధ్యత్వంలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. టెస్టోస్టెరాన్ స్థాయి బాగా ఉండాలంటే పచ్చి ఉల్లిపాయలను తినడం మంచిదని చెబుతున్నారు. మీ రోజువారీ సలాడ్‌లో చేర్చి పచ్చిగా తింటే ఇంకా బాగుంటుందని, పెరుగులో కొద్దిగా పచ్చి ఉల్లిపాయను కలిపి తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పిజ్జా తినండి..బరువు తగ్గండి.. కానీ..ఇలా చేస్తేనే!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు