Onion: ఉల్లిపాయ తినడం మంచిదేనా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
మనం రోజూ ఉపయోగించుకునే నిత్యవసర వస్తువుల్లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లి తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఉల్లిపాయ కేవలం కూరలకే కాదు.. అలాగే ఉల్లిపాయ జుట్టు, చర్మానికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కూడా అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఉల్లి రసం జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిలో విటమిన్లు ఏ, బి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. అలాగే ఉల్లి రసంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఉల్లి రసంతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా.. జుట్టు చిట్లిపోకుండా నిగనిగలాడేలా చేస్తుంది. అయితే ఉల్లి రసంతో ప్రయోజనాలే కాదు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.