Jaggery Benefits : పడుకునే ముందు బెల్లం తింటే.. ఈ వ్యాధులు పరార్!

ప్రతీరోజూ నిద్రకు ముందు బెల్లం తినటం వలన వ్యాధుల నుంచి దూరంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేయటంతో బెల్లం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. పాలు, నీటితో బెల్లాన్ని తాగితే.. పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

New Update
Jaggery Benefits : పడుకునే ముందు బెల్లం తింటే.. ఈ వ్యాధులు పరార్!

Jaggery : బెల్లం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే రోజువారీ ఆహారంలో బెల్లం చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు(Health Professionals) అంటున్నారు. ప్రతిరోజూ నిద్రకు ముందు బెల్లం తినటం వలన వ్యాధుల నుంచి దూరంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేయటంతో బెల్లం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ పాలు, నీటితో బెల్లాన్ని తాగితే.. పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతుంటారు. అంతేకాదు.. గ్యాస్ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ బెల్లాన్ని భోజనం తరువాత తీసుకోవాలంటున్నారు. బెల్లం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

బెల్లం ఆరోగ్యకరం:

  • బెల్లం(Jaggery) భారతదేశం(India) లోని అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. ఇది బెల్లం సహజమైన తీపి పదార్థం. చాలా మంది రిఫైన్డ్ షుగర్‌(Refined Sugar) ను ఎక్కువగా వాడుతుంటారు.
  • రక్తహీనతతో బాదపడేవారు బెల్లం తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. పిల్లలు కూరగాయలు సరిగ్గా తినకపోతే కూరగాయల్లో కొద్దిగా బెల్లం పొడి వేసి ఇవ్వచ్చు. టీలో పంచదారకు బదులు బెల్లం వేసి తాగవచ్చు. చలికాలంలో బెల్లం ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు.
  • ఇందులో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, రాగి, భాస్వరం వంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఈ మినరల్స్ మిశ్రమాన్ని పాలతో కలిపి తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం కూడా తగ్గుతుంది. బెల్లం బ్రెడ్, వెన్నతో కూడా తినవచ్చు. చాలా మంది బెల్లం కొన్ని కూరల్లో కలుపుకుని తింటారు.
  • ఎత్తు పెరగని, బరువు పెరగని పిల్లలకు సాధారణంగా బెల్లం, పాలు, పప్పు కలిపి ఇస్తారు. బరువు పెరగాలనుకుంటే బెల్లం తీసుకోవడం ద్వారా సులభంగా బరువు పెరుగుతారు.
  • రోజూ బెల్లం తింటే ఊపిరితిత్తుల్లో ఎలాంటి కాలుష్యం పేరుకుపోయినా బెల్లం దాన్ని తొలగిస్తుంది. బెల్లం వలన కాలుష్యాన్ని సులభంగా నిర్విషీకరణ చేయవచ్చు.

ఇది కూడా చదవండి : చౌకగా దొరికే ఈ బీన్స్‌లో ఇన్ని పోషకాలు ఉన్నాయా..?

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు