Cumin Tips: జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల శరీరానికి సంబంధించిన అనేక సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా వాపు కూడా తగ్గుతుంది.
మలబద్ధకం మాయం:
జీలకర్ర తినడం వల్ల స్థూలకాయం త్వరగా అదుపులోకి వస్తుంది. దీనితో పాటు కడుపు సంబంధిత సమస్యలు కూడా నయమవుతాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటివి ఉండవు. జీలకర్ర తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.
మంటను తగ్గిస్తుంది:
జీలకర్రలో ఐరన్, కాపర్, క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, కాపర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీలకర్ర నీరు తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది.
కడుపు నొప్పి నుంచి ఉపశమనం:
జీలకర్ర నీరు కడుపు నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. తేలికపాటి నొప్పి ఉంటే వేడి నీళ్లలో జీలకర్ర పొడి వేసి తాగాలి. దీని వల్ల నొప్పి తొందరగా తగ్గిపోతుందని వైద్యులు అంటున్నారు.
అజీర్ణానికి మంచిది:
చాలా మందికి నూనె, మసాలాలు తినడం వల్ల అజీర్ణం చేస్తుంది. అలాంటి వారు జీలకర్ర నీటిని తాగితే ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మలబద్ధకానికి కూడా జీలకర్ర బాగా పనిచేస్తుంది. జీలకర్రలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను నయం చేస్తుంది. అరుగుదల సమస్యలకు కూడా జీలకర్ర నీళ్లు బాగా పనిచేస్తాయి. ఏదైనా ఆహారం ఎక్కువగా తిన్నప్పుడు కాస్త జీలకర్రను గ్లాసు నీటిలో వేసుకుని వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఉపశమనం కలుగుతుందని వైద్యులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: వేసవిలో రోజూ మెంతి నీళ్లు తాగడం మంచిదేనా..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.