Weight Loss : ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తిన్నారంటే సులభంగా బరువు తగ్గొచ్చు

ఉదయం ఖాళీ కడుపుతో చియా విత్తనాలు, గంజి, బ్లూబెర్రీస్, గ్రీక్ పెరుగు, గుడ్లు వంటి తింటే శరీర బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే ఫైబర్, కేలరీలు, విటమిన్లు, మినరల్స్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచే మంచి ప్రోబయోటిక్ ఇందులో ఉంటుంది.

New Update
Weight Loss : ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తిన్నారంటే సులభంగా బరువు తగ్గొచ్చు

Weight Loss Tips : బరువు ఎక్కువగా(Over Weight) ఉన్నవారు తగ్గడానికి ఏమి తినాలని ఆలోచిస్తారు. అయితే.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గడం(Weight Loss) లో ఇది ఎంతో మేలు చేస్తుంది. జిమ్(Gym) గురించి ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, ఆహారం ఖర్చు ఎక్కువగా ఉన్నట్లయితే, బరువు తగ్గడానికి ఉదయం(Morning) ఖాళీ కడుపు(Empty Stomach) తో ఈ పదార్థాలు తింటే బరువు తగ్గుతారు. ఏం తింటే బరువు తగ్గుతారో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

చియా విత్తనాలు:

  • చియా గింజలు(Chia Seeds) ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఉదయం స్మూతీలో వాటిని కలిపి తింటే మంచిది.

గంజి:

  • ఇది తినడం ద్వారా మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండుగా ఉంచుతుంది.

గుడ్లు:

  • గుడ్లు(Eggs) ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే కోడిగుడ్లు తినడం వల్ల ఆకలిని నియంత్రించవచ్చు. రోజంతా తక్కువ కేలరీలు వినియోగించుకోవచ్చు. ఉదయాన్నే ఉడికించిన గుడ్లు తింటే మేలు.

బ్లూబెర్రీస్:

  • స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్న బెర్రీలు తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.

గ్రీక్ పెరుగు:

  • ప్రొటీన్లు అధికంగా ఉండే ఈ పదార్ధం పొట్ట నిండుగా ఉంచుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచే మంచి ప్రోబయోటిక్ ఇందులో ఉంటుంది. పండ్లు, తేనెతో తింటే మంచిది.

ఇది కూడా చదవండి: బాత్‌రూమ్‌లోకి ఫోన్‌ తీసుకెళ్తున్నారా..ఈ అనర్థాలు తప్పవు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే జామకాయ రసం తాగితే ఏమవుతుంది?

Advertisment
తాజా కథనాలు