China v/s Delhi : చైనా(China) లో పెను భూకంపం(Earthquake) సంభవించింది. చైనా టైమ్ ప్రకారం అర్ధరాత్రి 2:09 నిమిషాలకు చైనా దక్షిణ ప్రాంతంలోని గ్ఝిన్‌జియాంగ్ రీజియన్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. అక్సు ప్రీఫెక్షర్ రీజియన్ వుషి కంట్రీలో భూమి ప్రకంపించిందని చైనా ఎర్త్‌క్వాక్ సెంటర్ తెలిపింది. చైనా, కిర్గిజిస్తాన్ సరిహద్దుల్లో గ్ఝిన్ జియాంగ్ నీజియన్ ఉంటుంది. ఉపరితలం నుంచి 80 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించిందని అక్కడి అదికారులు చెబుతున్నారు.
Also Read:వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా
చైనాలో భూకంపం వల్ల అక్కడి భవనాలకు బీటలు వారాయి. విద్యుత్ వ్యవస్థ భారీగా దెబ్బతింది. ప్రజలు ఇళ్ళల్లోంచి బయటకు పరుగులు తీశారు. భయంతో రాత్రంతా చలిలోనే బయట ఉండిపోయారు. ఇళ్ళు స్వల్పంగా దెబ్బతినడంతో మళ్ళీ వాటిల్లోకి వెళ్ళడానికి భయపడ్డారు. రైల్వే రాకపోకలూ అంతరాయం కలిగింది.
ఢిల్లీ మీదనా ప్రభావం..
చైనా భూకంపం ఢిల్లీ(Delhi) ని వణికించింది. దీంతో పాటూ దాని పరిసర ప్రాంతాలనూ ఆ ప్రకంపనలు తాకాయి. ఘజియాబాద్, గ్రేటర్ నొయిడా, గుర్‌గావ్.. వంటి నగరాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
నిన్న ఉదయం విరిగిపడ్డ కొండచరియలు
మరోవైపు సోమవారం ఉదయం దక్షిణ చైనా లోనే కొండచరియలు విరిగిపడ్డాయి. ఇందులో 47 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వీరిలో ఎనిమిది మంది మృతి చెందారు. ఇక కొండచరియలు విరిగిన పడిన ప్రాంతం నుంచ ఇమరో 200మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read : Japan Earth Quakes:జపాన్‌లో ఎందుకు ఎక్కువ భూకంపాలు వస్తాయి? కారణం ఇదే