Life Style:ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే ఆరోగ్యమని మీకు తెలుసా?

భారతీయులకు నెయ్య అంటే మక్కువ. నిజానికి ఇది సూపర్‌ఫుడ్‌. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అయితే నెయ్యిని మామూలుగా తినే కంటే ఉదయాన్నే పరగడుపన తింటే ఇంకా మంచిది. అదెలాగో తెలుసా..

New Update
Life Style:ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే ఆరోగ్యమని మీకు తెలుసా?

నెయ్యి వంటలు ఘుమఘుమలాడ్డానికే కాదు..ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా చెయ్యిని ఎక్కువగా వాడతారు. నెయ్యిలో విటమిన్‌ ఎ, ఇ, డి, కె వంటి విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్‌, లినోలిక్, బ్యుటిరిక్ యాసిడ్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా దేశీ ఆవు నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది శరీరాన్ని డిటాక్స్‌ చేయడానికి, శరీరంలోని కణాలను పునరుజ్జీవింపజేసేందుకు ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అందుకే రోజూ ఉదయం పరగడుపున.. ఒక టీస్పూన్‌ ఆవునెయ్యి తీసుకుంటే ఆరోగ్యమే ఆరోగ్యం అంటున్నారు.

Also Read:బీఆర్ఎస్ తో కలిసే సమస్యే లేదు-ప్రధాని మోదీ

ఉదయం ఖాళీకడుపుతో ఒక టీస్పూన్‌ నెయ్యి తీసుకుంటే జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. కడుపులో జటరాగ్ని అని పిలిచే యాసిడ్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. నెయ్యి మలాన్ని మృదువుగా మారుస్తుంది, మలబద్ధకం సమస్యను పరిష్కరిస్తుంది. అంతేకాదు జీవక్రియను మెరుగుపరుస్తుంది. చిన్న ప్రేగులు పోషకాలను బాగా గ్రహించడానికి కూడా నెయ్యి తోడ్పడుతుంది.​

నెయ్యిని పూర్వ కాలం నుంచీ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇది ముక్కు, గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తుంది. నెయ్యి ఖాళీ కడుపుతో తీసుకుంటే.. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. తేలికపాటి జ్వరం, సాధారణ జలుబు వంటి రోజూవారి ఆనారోగ్యాలను నయం చేస్తుంది. రోజూ ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకుంటే.. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

నెయ్యి మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెదడులో 50% కంటే ఎక్కువ కొవ్వు ఉంటుంది. మెదడు పనితీరు సక్రమంగా పనిచేయాలంటే.. ఫ్యాటీ యాసిడ్స్‌ అవసరం. నెయ్యిలో ఫ్యటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మెదడుకు తగినంత కొవ్వును అందుతుంది.దానివల్ల అవసరమైన పోషణ అందుతుంది. నెయ్యి మెదడును హైడ్రేట్‌గా ఉంచుతుంది, తద్వారా అభిజ్ఞా విధులు, ఏకాగ్రతను పెంచుతుంది. అంతేకాకుండా, నెయ్యిలోని విటమిన్ ఇ మెదడు సమస్యల నుంచి రక్షిస్తుంది.

అర్థరైటిస్ నొప్పులను తగ్గించడానికి నెయ్యి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆస్టియోపోరసిస్‌ పేషెంట్స్‌లో మంటను తగ్గిస్తాయి. కాల్షియం లోపం ఉన్న మహిళలు ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. నెయ్యి కీళ్లు, కణజాలాల మధ్య లూబ్రికేషన్‌ను అందిస్తుంది. తద్వారా ఎముకల బలాన్ని పెంచుతుంది, బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది.

దేశీ ఆవు నెయ్యి.. అద్భుతమైన కూలింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. నెయ్యిలోని ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ దృష్టి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుుంది. కంటి అలసట, కళ్లు పొడిబారడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్‌, మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ మంచి కొలెస్ట్రాల్, గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మొండి కొవ్వు, టాక్సిన్‌లను బయటకు పంపడానికి తోడ్పడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను 10 నుంచి 20% తగ్గిస్తుంది. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి తోడ్పడతాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు