TS EAPCET: ఎమ్‌సెట్‌ ఇకనుంచి ఎప్‌సెట్.. పరీక్ష తేదీలు ఇవే

రాష్ట్రంలో ఏటా నిర్వహించే ఎమ్‌సెట్‌ ఇకనుంచి ఎప్‌సెట్‌గా పిలవబడుతుంది. మెడికల్ స్థానంలో ఫార్మసీని చేర్చడంతో.. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సెట్‌ - ఈఏపీసెట్‌ (EAPCET) గా మార్చారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో జారీ చేశారు.

TS PECET: టీఎస్ పీఈసెట్-2024 షెడ్యూల్ విడుద‌ల‌..
New Update

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జరిగే ఎమ్‌సెట్‌.. ఇకనుంచి ఎప్‌సెట్‌గా పిలవబడుతుంది. మెడికల్ ప్రవేశాలను ఎంసెట్ నుంచి తొలగించి నీట్‌ ద్వారా ఆ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి దాని పేరును ఎప్‌సెట్‌గా మార్చారు. అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సెట్‌ - ఈఏపీసెట్‌ (EAPCET) గా మార్చారు. ఇక్కడ మెడికల్ స్థానంలో ఫార్మసీని చేర్చారు. ఇప్పుడది తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ సెట్‌గా మారిపోయింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో జారీ చేశారు.

Also Read: పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలకు సీఎం జగన్ అభినందనలు

మే 9 నుంచి 13 వరకు ఎప్‌సెట్‌

అంతేకాదు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎప్‌సెట్‌ సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మే 9 నుంచి 13 వరకు ఎప్‌సెట్‌ పరీక్ష జరగనుంది. మొదటి 3 రోజులు ఇంజినీరింగ్ కాగా.. ఇక చివరి రెండ్రోజులు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, బుర్రా వెంకటేశం తదితరులు కలిసి పరీక్ష తేదీలను విడుదల చేశారు.

ఫిబ్రవరి నెలఖారకు నోటిఫికేషన్లు

మరో విషయం ఏంటంటే పరీక్షలను నిర్వహించే విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి మార్పులు లేవు. అయితే ఈసారి మొత్తం 7 ప్రవేశ పరీక్షలు అంటే మే లో 3, జూన్‌లో 4 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసెట్, ఎప్‌సెట్, ఎడ్‌సెట్‌ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. ఇక జూన్‌లో లాసెట్, ఐసెట్, పీజీఈసెట్, పీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఫిబ్రవరి నెల చివరి నుంచి నోటిఫికేషన్ల జారీ మొదలుకానుంది. మార్చి మొదటివారంలో ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది.

పరీక్ష తేదీలు

TS EAPCET -  May 9 - 13

TS LAWCET – June 3

TS ICET – June 4 and 5

TS PG ECET – June 6 to June 8

TS PECET – June 10 to 13.

Also Read: కాంగ్రెస్ కథ ఖతం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

#telugu-news #telangana-news #eapcet #eamcet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe