Netharlands: సింపుల్‌గా సైకిలెక్కి వెళ్ళిపోయారు..

పధ్నాలుగేళ్ళు ప్రధానిగా ఉన్నారు. అన్నేళ్ళు హోదాను, దర్జాను అనుభవించారు. కానీ అది అయిపోగానే అన్నింటినీ వదిలేసి సామాన్యుడిలా సెకిలెక్కి వెళ్లిపోయారు. నెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రుట్టే సింపుల్ సిటీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Netharlands: సింపుల్‌గా సైకిలెక్కి వెళ్ళిపోయారు..

Ex Prime Ministerనెదర్లాండ్స్‌లో కొత్త ప్రభుత్వం వచ్చింది. డిక్ స్కూఫ్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు అంతకు ముందు 14 ఏళ్ళ పాటూ మార్క్ రుట్టే ప్రధానిగా ఉన్నారు. కొత్త ప్రధాని వచ్చాక మార్క్ రుట్టే ఆయకు బాధ్యతలు అప్పగించి, తన నివాసాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అయితే ఇది అందరూ చేసే పే. కానీ మార్క్ అందరిలా ఆడంబం కాకుండా చాలా సింపుల్‌గా సెకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఇప్పుడు అదే అందరినీ ఆకర్షిస్తోంది. భారీ బందోస్తును పక్కన పెట్టి..సైకిల్ మీద అధికారులకు, సిబ్బందికి టాటా చెప్పుకుంటూ మార్క్ వెళ్ళారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్చేస్తోంది. ఆయన సింపుల్‌సిటీపై నెటిజన్లు తెగ పొగొడుతున్నారు. ఈ వీడియోను రిటైర్డ్‌ పోలీసు అధికారిణి, పుదుచ్చేరి మాజీ గవర్నర్‌ కిరణ్‌ బేడీ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. అధికార మార్పిడి ఇలా శాంతియుతంగా, ఆనందంగా ఉంటే ప్రజాస్వామ్యం బాగుంటుందని ఆమె అన్నారు.

2010లో మార్క్ రుట్టే మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా ఆయనే పదవిలో కొనసాగుతూ వచ్చారు. గత ఏడాది జూలైలో ఈయన ప్రభుత్వం పడిపోయింది. అప్పుడే ఆయన రాజీనామా చేశారు. అయితే వెంటనే కొత్త ప్రుత్వం ఏర్పడకపోవడంతో ఇంతవరకు ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది చివర్లో నెదర్లాండ్స్‌లో ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం తప్పలేదు. కానీ సంకీర్ణప్రభుత్వంలో వలసల విధానంపై అంగీకారం రాలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు