Andhra Pradesh : సీఎం జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్.. అతనికి సంబంధం లేదు

ఆంధ్రా సీఎం జగన్‌పై దాడి కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. నిన్నటి వరకు నిందితులు ఇద్దరు అని చెప్పారు. సతీష్ అనే వ్యక్తి చేత దుర్గారావు అనే వ్యక్తి కొట్టించాడు అన్నారు. కానీ ఈరోజు దుర్గారావుకు ఈ దాడితో సంబంధం లేదని చెబుతున్నారు పోలీసులు.

New Update
Andhra Pradesh : సీఎం జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్.. అతనికి సంబంధం లేదు

Ap CM Jagan Attack Case : ఏపీ సీఎం జగన్(CM Jagan) పై దాడి కేసులో A1 గా ఉన్న సతీష్‌ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సతీష్ కు కోర్టు రిమాండ్ కూడా విధించింది. అయితే.. ఈ కేసులో A2గా దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు నిన్నటి వరకు అరెస్ట్‌ను చూపలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 16న దుర్గారావును పోలీసులు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అప్పటి నుంచి అతను పోలీసులు అదుపులోనే ఉన్నాడు. కానీ ఎవరికీ దుర్గారావు(Durga Rao) ను మాత్రం చూపించలేదు.

ఇప్పుడు సడెన్‌గా మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారు ఆంధ్రా పోలీసులు(Andhra Police). దుర్గారావుకు జగన్ దాడిక ఇఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. తాము పూర్తిగా విచారణ చేశామని...అతనే దాడి చేయించినట్లుగా ఎటువంటి ఆధారాలు బయటపడలేదని చెప్పారు. విచారణ అనంతరం దుర్గారావును విడుదల కూడా చేశారు. అంతే కాదు అతనని కుటుంబసభ్యలకు సైతం అప్పగించారు పోలీసులు. మరోవైపు ఇంకో నిందితుడు సతీష్ మాత్రం ఇంకా రిమాండ్‌లోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు దుర్గారావు దోషి కాదు అని తేలడంతో దాడి వెనుక ఎవరున్నారనేది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. దీంతో ఈ కేసుకు సంబంధించి సిట్ విచారనను మరింత వేగవంతం చేసింది.

ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నాని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు కదలికలు ఉన్నట్లు నిర్ధారించాయన్నారు. మాకు వచ్చిన సమాచారం మేరకు అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. 17న నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి మొబైల్ ఫోన్ సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడు కేసులో A2 ప్రోద్బలంతో దాడికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఇప్పుడు ఆ ఏ2 దుర్గారావు కాదు కాబట్టి అది ఎవరన్నది కనుక్కోవలసి ఉంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య(Murder) చేసేందుకు పదునైన రాయితో దాడి చేశాడని వెల్లడించారు. దాడి వెనుక సీఎం ను చంపాలన్న ఆలోచన ఉందన్నారు. ఈ నేపథ్యంలో అదను చూసి సీఎం జగన్ సున్నితమైన తల భాగంలో దాడి చేశాడన్నారు. దాడి జరిగిన రోజు రాత్రి 8:04 గంటల సమయంలో ప్రజలతో కలిసి బస్సు యాత్రలో నిందితుడు ఉన్నాడన్నారు. దాడి చేయడానికి సిమెంట్ కాంక్రీట్ రాయి తీసుకొని వచ్చాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.

Also Read:Telangana: మాధవీలతకు బీజేపీ బిగ్‌ షాక్‌.. నో బీఫామ్ ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు