Balakrishna: బాలయ్యతో.. దుల్కర్ సల్మాన్.. సినిమా ఏంటో తెలుసా..!

అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత.. బాలయ్య NBK109 వర్కింగ్ టైటిల్ తో నెక్స్ట్ మూవీ చేస్తున్నారు. తాజాగా దీని గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. NBK109 లో దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

New Update
Balakrishna: బాలయ్యతో.. దుల్కర్ సల్మాన్.. సినిమా ఏంటో తెలుసా..!

Balakrishna - Dulquer Salmaan Movie:  వరుస హిట్స్ తో ఊపు మీద ఉన్నారు నట సింహం నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాతో మొదలైన బాలయ్య క్రేజ్ అన్ స్టాపబుల్ గా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే విడుదలైన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టి బాలయ్యకు భారీ విజయాన్ని అందించింది. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్స్ తో రికార్డు క్రియేట్ చేశారు. బ్యాక్ టూ బ్యాక్ మూడు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న బాలయ్య..   బాబీ డైరెక్షన్ లో నెక్స్ట్ మూవీ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. NBK109 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్. "World knows him, no one knows his world". అనే హ్యస్ ట్యాగ్ తో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

publive-image

Also Read: బాలయ్య ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే న్యూస్.. నెక్స్ట్ మూవీ గురించి తెలిస్తే పూనకాలే..!

బాలయ్యతో దుల్కర్ సల్మాన్
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబీ దర్శకత్వంలో (Director Bobby) బాలయ్య నటిస్తున్న NBK109 లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) స్పెషల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దుల్కర్, బాలయ్య మధ్య ఉండే కొన్ని సీన్స్ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని టాక్. కానీ దుల్కర్ పాత్ర పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

publive-image

బాలకృష్ణ 109 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైమెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ గా ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. అయితే గతంలో సినిమాలో బాలయ్య సంబంధించిన సన్నివేశాలు కేవలం 28 రోజుల్లోనే షూట్ చేయాలని ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

Also Read: Hanu-Man : హనుమాన్‌ సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌ వైరల్‌

Advertisment
తాజా కథనాలు