Hanu-Man : హనుమాన్‌ సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌ వైరల్‌

తేజ సజ్జ లేటెస్ట్ చిత్రం హనుమాన్ రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయోధ్యలో బాలా రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్' ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ చేసినట్లు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

New Update
Hanu-Man : హనుమాన్‌ సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌ వైరల్‌

Hanu-Man - 2 :  యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) డైరెక్టర్ ప్రశాంత వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ చిత్రం హనుమాన్(Hanu-Man). సంక్రాంతి(Sankranti) కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) లో హనుమాన్ ఫుల్ ట్రెండింగ్ లో సాగుతోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఊహించని విధంగా జనాల్లోకి వెళ్ళింది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ వసూళ్లతో దూసుకెళ్తుంది. పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది. సినిమా జోరు మరింత కొనసాగే అవకాశం కూడా ఉంది. ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో 200 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఇలా ఉంటే హనుమాన్ మూవీ ఎండింగ్ లో ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్టు రివీల్ చేసిన సంగతి తెలిసిందే. సీక్వెల్ గా రాబోతున్న చిత్రానికి జై హనుమాన్ అని టైటిల్ కూడా స్పష్టం చేశారు ప్రశాంత్ వర్మ.

Hanu-Man

Also Read: Mega Heroes: ఆ మూడు నెలలు మెగా ఫ్యాన్స్ కు పండగే.. వరుసగా మెగా సినిమాల సందడి

జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్

ఇక తాజాగా అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ  సందర్భంగా సీక్వెల్ పై మరో లేటెస్ట్ అప్డేట్ రివీల్ చేశారు ప్రశాంత్ వర్మ. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట రోజు హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ చేసినట్లు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో జై హనుమాన్ స్క్రిప్ట్ బుక్ పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.

Hanu-Man

దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. "హనుమాన్ సినిమా పై ఇంత ప్రేమ, ఆదరణ చూపినందుకు కృతజ్ఞతలు. నా ప్రామిస్ నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పినట్లుగానే జై హనుమాన్ 2025 లో రిలీజ్ చేస్తాము. జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదని" తెలిపారు. ఇప్పటికే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా ఓవర్ సీస్ ఆడియన్స్ కోసం సగం ధరకే టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. హనుమాన్ షో వేసిన 11 థియేటర్స్ లో ఈ ఆఫర్ ఉన్నట్లు తెలిపారు.

Also Read: Namrata Birth Day: నమ్రతకు.. మహేష్ బాబు బ్యూటీఫుల్ విషెస్.. వైరలవుతున్న ట్వీట్

#jai-hanuman-pre-production-work #prasanth-varma #hanu-man
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు