Mahadev betting app:పోలీసుల అదుపులో మహదేవ్ యాప్ ఓనర్

New Update
Mahadev betting app:పోలీసుల అదుపులో మహదేవ్ యాప్ ఓనర్

మహదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్..ఇదొక పెద్ద స్కామ్. ఏడాది కాలంగా దేశంలో ఇది కలకలం సృష్టిస్తోంది. అప్పటి నుంచి దీనికి సంబంధించిన ఇద్దరు ఓనర్లు పరారీలో ఉన్నారు. తాజాగా ఒక ఓనర్ అయిన రవి ఉప్పల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్ ను దుబాయ్ లో పోలీసులు అదులోకి తీసుకున్నారు. ఇంటర్ పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా రవిని దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అధికా వర్గాలు తెలిపాయి. ఇతనిని భారత్ తీసుకొచ్చేందుకు దుబాయ్ అధికారులతో ఈడీ సంప్రదింపులు జరుపుతోంది.

Also Read:హమాస్-ఇజ్రాయెల్ వార్.. దానికే ఓటేసిన భారత్

మహదేవ బెట్టింగ్ యాప్ ను క్రియేట్ చేసిన సౌరభ్ చంద్రకర్ (Sourabh Chandrakar), రవి ఉప్పల్ (Ravi Uppal) ఇద్దరూ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బిలాయ్ కు చెందిన వారు. యాప్ క్రియేట్ చేయకముందు సౌరభ్ జ్యూస్ షాప్ నిర్వహిస్తూ ఉండేవాడు. రవికి టైర్ షాప్ ఉండేది. వీరిద్దరికీ గ్యాంబ్లింగ్ అంటే చాలా ఇష్టమట. దానికి బానిసలైన తమ వ్యాపారాలను వదిలేసి దుబాయ్ కు వెళ్ళిపోయారు. అక్కడే వీళ్ళ జీవితాలు ఒక ములుపు తీసుకున్నాయి. రెండు, మూడు ఏళ్ళల్లో ఏకంగా 5వేల కోట్లు సంపాదించే రేంజ్ కు తీసుకువెళ్లిపోయింది.

దుబాయ్ లో సౌరభ్, రవిలకు ఓ షేక్, మరో పాకిస్తానీ యువకుడితో పరిచయం అయింది. వారి సాయంతోనే మహదేవ బెట్టింగ్ యాప్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత భారత్‌లో వీరి తరుఫున వ్యాపారాలు నిర్వహించేందుకు 4వేల మంది ప్యానెల్ ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు 200 మంది కస్టమర్లు ఉన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా రోజుకు 200 కోట్ల రూపాయిలు చేతులు మారతాయి. ఈ డబ్బులతోనే సౌరభ్, రవిలు దుబాయ్ లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోగలిగారు. మహదేవ్ ఆన్‌లైన్ బుక్‌ను 70:30 లాభ నిష్పత్తి ప్రకారం యూఏఈలోని కార్యాలయం నుంచి ఫ్రాంఛైజీ ద్వారా నడిపారు.కొత్త వినియోగదారులను చేర్చుకొని యూజర్ ఐడీలను క్రియేట్‌చేసి, బినామీ బ్యాంకు ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బులను మళ్లించేందుకు మహాదేవ్ బుక్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తోందనేది ఈడీ ప్రధాన ఆరోపణ. బెట్టింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని హవాలా ద్వారా ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలిస్తోందని ఈడీ తెలిపింది.

Advertisment
తాజా కథనాలు